Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

టీమిండియా విజృంభణ..

Sports | Updated: Jun 11, 2017 13:04 (IST)


లండన్:చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టీమిండియా విజృంభించింది. తొలుత బ్యాటింగ్  చేసిన దక్షిణాఫ్రికాను 191 పరుగులకే కట్టడి చేసి శభాష్ అనిపించింది. ఏ దశలోనూ సఫారీలను  తేరుకోనీయకుండా చేసి భారత్ పైచేయి సాధించింది. భారత దెబ్బకు పేకమేడలా కూలిపోయిన దక్షిణాఫ్రికా కనీసం రెండొందల మార్కును కూడా దాటలేకపోయింది.

 

దక్షిణాఫ్రికా ఆటగాళ్లలో డీకాక్(53;72 బంతుల్లో 4 ఫోర్లు), హషీమ్ ఆమ్లా(35;54 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), డు ప్లెసిస్(36;50 బంతుల్లో 1 ఫోర్) మినహా ఎవరూ చెప్పుకోదగ్గ స్కోరు చేయకపోవడంతో ఆ జట్టు 44.3 ఓవర్లలో 191 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి ముందుగా సఫారీలను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు.  దాంతో బ్యాటింగ్ చేపట్టిన సఫారీలకు శుభారంభం లభించింది.

ఓపెనర్లు డీకాక్-ఆమ్లాలు ఇన్నింగ్స్ ను నిలకడగా ఆరంభించారు. ఆదిలో ఆచితూచి ఆడుతూ మధ్య మధ్యలో బౌండరీలు సాధిస్తూ స్కోరు బోర్డును ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే తొలి వికెట్ కు 76 పరుగులు భాగస్వామ్యం వచ్చిన తరువాత ఆమ్లా పెవిలియన్ చేరాడు. ఆపై డీకాక్ కు జత కలిసిన డు ప్లెసిస్ బాధ్యతాయుతంగా ఆడాడు. కాగా, జట్టు స్కోరు 116 పరుగుల వద్ద డీకాక్ రెండో వికెట్ గా అవుటయ్యాడు. అటు తరువాత డివిలియర్స్(16), మిల్లర్(1) స్వల్ప వ్యవధిలో అవుట్ కావడంతో దక్షిణాఫ్రికా తేరుకోలేకపోయింది. స్కోరును పెంచే క్రమంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు వరుసగా క్యూకట్టారు. ఆరుగురు ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో దక్షిణాఫ్రికా స్పల్ప స్కోరుకే పరిమితమైంది. భారత బౌలర్లలో భువనేశ్వర్  కుమార్, బూమ్రాలు తలో రెండు వికెట్లు సాధించగా,అశ్విన్, పాండ్యా, రవీంద్ర జడేజాలు వికెట్ చొప్పున తీశారు.


టాగ్లు: india,south africa,champions trophy 2017,భారత్,దక్షిణాఫ్రికా,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


'అవుట్' కోసం పోటీ పడ్డారు!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...

'ఆ క్రికెటర్ ను ప్రతీ జట్టు కోరుకుంటుంది'
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ ...

అశ్విన్ వచ్చేశాడు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...

ఆసీస్‌ కథ కంచికి
చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ...

‘సఫారీ’ దాటితేనే సెమీస్‌
భారత జట్టుకు ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లి 22 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ...

కెప్టెన్ కోహ్లీకి గంగూలీ కీలక సూచన!
టీమిండియా తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో జట్టులోకి ఓ ఆటగాడిని తీసుకోవాలని కెప్టెన్.. ...

ఒక్క మ్యాచ్‌ గెలువకుండానే..
వన్డే వరల్డ్‌కప్‌ విజేత అయిన ఆస్ట్రేలియా చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి అవమానకరరీతిలో వైదొలిగింది. ...

ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు:కోహ్లి
దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్కు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ ...

అశ్విన్ ను ప్రయోగిస్తారా?
చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ...

ఆసీస్ నిలుస్తుందా?
చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్లు రద్దు ...



ఈరోజు ....


  భారత్
X
  దక్షిణాఫ్రికా

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.