Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

ఆసీస్‌ కథ కంచికి

Sports | Updated: Jun 11, 2017 08:36 (IST)


‘డక్‌వర్త్‌’ పద్ధతిన ఇంగ్లండ్‌ గెలుపు
బెన్‌ స్టోక్స్‌ అజేయ సెంచరీ


బర్మింగ్‌హామ్‌: చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. పేలవ బ్యాటింగ్‌కు పస లేని బౌలింగ్‌ కూడా తోడవ్వడంతో కచ్చితంగా నెగ్గాల్సిన ఈ మ్యాచ్‌లోనూ మాజీ చాంపియన్‌ చిత్తయ్యింది. అయితే పలుమార్లు వర్షం అంతరాయం కలిగించిన ఈ మ్యాచ్‌లో చివరకు డక్‌వర్త్‌ లూయిస్‌ పద్ధతిన ఇంగ్లండ్‌ 40 పరుగుల తేడాతో నెగ్గింది. వరుసగా మూడు విజయాలు సాధించిన ఇంగ్లండ్‌ 6 పాయింట్లతో గ్రూప్‌ ‘ఎ’ టాపర్‌గా నిలిచింది. ఆసీస్‌ రెండు పాయింట్లతో మూడో స్థానానికి పరిమితమైంది. బంగ్లాదేశ్‌ మూడు పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి ఇంగ్లండ్‌ తర్వాత ఈ గ్రూప్‌ నుంచి రెండో సెమీఫైనల్‌ బెర్త్‌ను దక్కించుకుంది.

ఆసీస్‌తో శనివారం జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌లో 278 పరుగుల లక్ష్యం కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 40.2 ఓవర్లలో 4 వికెట్లకు 240 పరుగులు చేసింది. ఈ దశలో  వర్షం రావడంతో మిగతా ఆట సాధ్యం కాలేదు. ఆట నిలిచిపోయే సమయానికి డక్‌వర్త్‌ లూయీస్‌ నిబంధనల ప్రకారం ఇంగ్లండ్‌ 4 వికెట్లకు 200 పరుగులు చేస్తే సరిపోతుంది. అప్పటికే 40 పరుగులు ముందంజలో ఉన్న ఇంగ్లండ్‌ విజేతగా నిలిచింది. బెన్‌ స్టోక్స్‌ (109 బంతుల్లో 102 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగగా... ఇయాన్‌ మోర్గాన్‌ (81 బంతుల్లో 87; 8 ఫోర్లు, 5 సిక్సర్లు) వేగంగా ఆడాడు. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 50 ఓవర్లలో 9 వికెట్లకు 277 పరుగులు చేసింది. ట్రావిస్‌ హెడ్‌ (64 బంతుల్లో 71 నాటౌట్‌; 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆరోన్‌ ఫించ్‌ (64 బంతుల్లో 68; 8 ఫోర్లు), స్మిత్‌ (77 బంతుల్లో 56; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. వుడ్, రషీద్‌లకు నాలుగేసి వికెట్లు దక్కాయి. స్టోక్స్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ పురస్కారం లభించింది.

స్టోక్స్, మోర్గాన్‌ అదుర్స్‌: 278 పరుగుల టార్గెట్‌ కోసం బరిలోకి దిగిన ఇంగ్లండ్‌ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. స్టార్క్, హాజెల్‌వుడ్‌ ధాటికి ఆరు ఓవర్లలోపే రాయ్‌ (4), హేల్స్‌ (0), రూట్‌ (15) పెవిలియన్‌కు చేరారు. ఆ తర్వాత వర్షం అంతరాయంతో దాదాపుగా గంటసేపు మ్యాచ్‌ ఆగిన అనంతరం మోర్గాన్, స్టోక్స్‌ తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ బౌలర్లను ఆటాడుకున్నారు. అయితే 32వ ఓవర్‌లో స్టోక్స్‌ సింగిల్‌ కోసం ముందుకురాగా ఆలస్యంగా స్పందించిన మోర్గాన్‌.. జంపా విసిరిన అద్భుత త్రోకు రనౌట్‌ అయ్యాడు. దీంతో నాలుగో వికెట్‌కు 159 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత 108 బంతుల్లో స్టోక్స్‌ సెంచరీ అయ్యాక మరోసారి వర్షం ఆటంక పరచడంతో మ్యాచ్‌ వీలు కాలేదు.

స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) బట్లర్‌ (బి) వుడ్‌ 21; ఫించ్‌ (సి) మోర్గాన్‌ (బి) స్టోక్స్‌ 68; స్మిత్‌ (సి) ప్లంకెట్‌ (బి) వుడ్‌ 56; హెన్రిక్స్‌ (సి) ప్లంకెట్‌ (బి) రషీద్‌ 17; హెడ్‌ నాటౌట్‌ 71; మ్యాక్స్‌వెల్‌ (సి) రాయ్‌ (బి) వుడ్‌ 20; వేడ్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 2; స్టార్క్‌ (సి) రూట్‌ (బి) రషీద్‌ 0; కమిన్స్‌ (సి అండ్‌ బి) రషీద్‌ 4; జంపా (బి) వుడ్‌ 0; హాజల్‌వుడ్‌ నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 17; మొత్తం (50 ఓవర్లలో 9 వికెట్లకు) 277.
వికెట్ల పతనం: 1–40, 2–136, 3–161, 4–181, 5–239, 6–245, 7–245, 8–253, 9–254.  బౌలింగ్‌: బాల్‌ 9–1–61–0, వుడ్‌ 10–1–33–4, ప్లంకెట్‌ 8–0–49–0, స్టోక్స్‌ 8–0–61–1, రషీద్‌ 10–1–41–4, మొయిన్‌ అలీ 5–0–24–0.
ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ ఎల్బీడబ్ల్యూ (బి) స్టార్క్‌ 4; హేల్స్‌ (సి) ఫించ్‌ (బి) హాజల్‌వుడ్‌ 0; రూట్‌ (సి) వేడ్‌ (బి) హాజల్‌వుడ్‌ 15; మోర్గాన్‌ రనౌట్‌ 87; స్టోక్స్‌ నాటౌట్‌ 102; బట్లర్‌ నాటౌట్‌ 29; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (40.2 ఓవర్లలో 4 వికెట్లకు) 240.
వికెట్ల పతనం:1–4, 2–6, 3–35, 4–194.
బౌలింగ్‌: స్టార్క్‌ 10–0–52–1, హాజల్‌వుడ్‌ 9–0–50–2, కమిన్స్‌ 8–1–55–0, హెడ్‌ 2–0–9–0, హెన్రిక్స్‌ 1–0–6–0, జంపా 8.2–0–52–0, మ్యాక్స్‌వెల్‌ 2–0–14–0.


టాగ్లు: England,Ben Stokes,Australia,ఇంగ్లండ్‌,బెన్‌ స్టోక్స్‌,ఆస్ట్రేలియా

మరిన్ని వార్తలు


టీమిండియా విజృంభణ..
చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టీమిండియా ...

'అవుట్' కోసం పోటీ పడ్డారు!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...

'ఆ క్రికెటర్ ను ప్రతీ జట్టు కోరుకుంటుంది'
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ ...

అశ్విన్ వచ్చేశాడు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...

‘సఫారీ’ దాటితేనే సెమీస్‌
భారత జట్టుకు ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లి 22 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ...

కెప్టెన్ కోహ్లీకి గంగూలీ కీలక సూచన!
టీమిండియా తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో జట్టులోకి ఓ ఆటగాడిని తీసుకోవాలని కెప్టెన్.. ...

ఒక్క మ్యాచ్‌ గెలువకుండానే..
వన్డే వరల్డ్‌కప్‌ విజేత అయిన ఆస్ట్రేలియా చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి అవమానకరరీతిలో వైదొలిగింది. ...

ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు:కోహ్లి
దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్కు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ ...

అశ్విన్ ను ప్రయోగిస్తారా?
చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ...

ఆసీస్ నిలుస్తుందా?
చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్లు రద్దు ...



ఈరోజు ....


  భారత్
X
  దక్షిణాఫ్రికా

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.