Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

'అవుట్' కోసం పోటీ పడ్డారు!

Sports | Updated: Jun 11, 2017 12:14 (IST)




లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. దక్షిణాఫ్రికా ఆటగాళ్లు 'అవుట్' నుంచి తప్పించుకునేందుకు ఒకరితో ఒకరు పోటీ పడిన అరుదైన సన్నివేశం ఆవిష్కృతమైంది. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ లో భాగంగా అశ్విన్  వేసిన 30వ ఓవర్  తొలి బంతిని డు ప్లెసిస్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. థర్డ్ మ్యాన్ దిశగా తరలించిన ఆ బంతికి డు ప్లెసిస్ పరుగు తీసేందుకు ముందుకొచ్చాడు. అయితే అవతలి ఎండ్ లో ఉన్న డేవిడ్ మిల్లర్ కూడా పరుగు కోసం సగం క్రీజ్ దాటి వచ్చాడు.

అయితే ఆ బంతిని వేగంగా అందుకున్న బూమ్రా నాన్ స్టైకింగ్ ఎండ్ వైపు వేగంగా విసిరాడు.  దాంతో రనౌట్ తప్పదని భావించిన సఫారీ ఆటగాళ్లు మిల్లర్-డు ప్లెసిస్ లు తమను అవుట్ నుంచి రక్షించుకునేందుకు స్ట్రైకింగ్ ఎండ్ వైపు వేగంగా పరుగు తీశారు. ఇక నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో బ్యాట్స్ మన్ ఎవరూ లేకపోవడంతో ఆ బంతిని అందుకున్న కోహ్లి ఎటువంటి తడబాటు లేకుండా వికెట్లను ఎగురేశాడు. కాగా, అసలు అవుట్ ఎవరయ్యారనే దాని కోసం ఫీల్డ్ అంపైర్లు.. థర్డ్ అంపైర్ రివ్యూను కోరాల్సి వచ్చింది. ఇక్కడ మిల్లర్ అవుట్ గా పెవిలియన్ చేరాడు.


టాగ్లు: india,south africa,champions trophy 2017,భారత్,దక్షిణాఫ్రికా,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


పాకిస్తాన్ తొమ్మిదిసార్లు..
చాంపియన్స్ ట్రోఫీలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ...

ఇంగ్లండ్ జెర్సీ ధరిస్తాడా?
ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టడం ఆ దేశ మాజీ క్రికెటర్ ...

మ్యాచ్‌లో గొప్ప మలుపు అదే
తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేయడంపై టీమిండియా కెప్టెన్‌ ...

నాకో చాన్స్‌ ఇవ్వండి..
చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో చెత్త ఆటతీరు ప్రదర్శించడంపై దక్షిణాఫ్రికా.. ...

భారత బౌలర్ల అరుదైన రికార్డు
చాంపియన్‌ట్రోఫీలో మరో అరుదైన రికార్డు నమోదైంది ...

కొట్టేశాం...సఫారీని, సెమీస్‌ బెర్త్‌ని
టీమిండియా సమష్టి ప్రదర్శన ...

కొట్టేశాం...సఫారీని, సెమీస్‌ బెర్త్‌ని
టీమిండియా సమష్టి ప్రదర్శన ...

సెమీస్‌లోకి విరాట్‌ సేన
గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన ...

సెమీస్లోకి విరాట్ సేన..
గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన ...

టీమిండియా విజృంభణ..
చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టీమిండియా ...



ఈరోజు ....


  శ్రీలంక
X
  పాకిస్తాన్

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 +1.370
SA 3 1 2 2 +0.167
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.