Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

కొట్టేశాం...సఫారీని, సెమీస్‌ బెర్త్‌ని

Sports | Updated: Jun 12, 2017 03:16 (IST)


టీమిండియా సమష్టి ప్రదర్శన
బ్యాటింగ్‌లో రాణించిన కోహ్లి, ధావన్‌
బౌలింగ్‌లో మెరిసిన బుమ్రా, భువనేశ్వర్‌


బౌలర్లు భళా... ఫీల్డర్లు భేష్‌... బ్యాట్స్‌మెన్‌ జోష్‌... తుదకు భారత్‌ చేరింది సెమీస్‌. క్వార్టర్స్‌ను తలపించిన ఈ లీగ్‌ పోరులో కోహ్లి సేన ఆల్‌రౌండ్‌ విశ్వరూపమిది. కేవలం పరుగులు సాధిస్తే సరిపోదని గత మ్యాచ్‌ అనుభవంతో గుర్తించిన టీమిండియా అన్నింటా ఆధిపత్యాన్ని చూపింది. సఫారీ జట్టును దెబ్బమీద దెబ్బ కొట్టింది. మొదట దక్షిణాఫ్రికా ఓపెనర్ల శుభారంభానికి భారత బౌలర్లు తూట్లు పొడిస్తే, ఫీల్డర్లు కీలక బ్యాట్స్‌మెన్‌ను రనౌట్‌ చేశారు. విజయ లక్ష్యంలో టాపార్డర్‌ జాగ్రత్తగా ఆడి సెమీస్‌ బెర్త్‌ను తెచ్చిపెట్టింది.


లండన్‌: ప్రపంచ నంబర్‌వన్‌ జట్టు దక్షిణాఫ్రికాను డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ ఆల్‌రౌండ్‌ షోతో దెబ్బ కొట్టింది. చాంపియన్స్‌ ట్రోఫీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. గ్రూప్‌ ‘బి’లో ఆదివారం జరిగిన పోరులో భారత్‌ 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌ చేపట్టిన దక్షిణాఫ్రికా 44.3 ఓవర్లలో 191 పరుగులు చేసి ఆలౌటైంది. డికాక్‌ (72 బంతుల్లో 53; 4 ఫోర్లు) రాణించాడు. భారత బౌలర్లలో భువనేశ్వర్, బుమ్రా చెరో 2 వికెట్లు తీయగా... జడేజా, అశ్విన్, పాండ్యా తలా ఒక వికెట్‌తో టాపార్డర్‌ను దెబ్బతీశారు. తర్వాత భారత్‌ 38 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 193 పరుగులు చేసి జయభేరి మోగించింది. ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ (83 బంతుల్లో 78; 12 ఫోర్లు, 1 సిక్స్‌) తన సూపర్‌ ఫామ్‌ చాటగా... కెప్టెన్‌ కోహ్లి (101 బంతుల్లో 76 నాటౌట్‌; 7 ఫోర్లు, 1 సిక్స్‌) ఆకట్టుకున్నాడు.

ప్రొటీస్‌ బౌలర్లలో మోర్కెల్, తాహిర్‌ చెరో వికెట్‌ తీశారు. బుమ్రాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది. ప్రస్తుతం గ్రూప్‌ ‘బి’లో భారత్‌ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. ఫలితంగా సెమీఫైనల్లో గ్రూప్‌ ‘ఎ’లో రెండో స్థానం పొందిన బంగ్లాదేశ్‌తో భారత్‌ తలపడటం దాదాపుగా ఖాయమైంది. నేడు పాకిస్తాన్, శ్రీలంక జట్ల మధ్య గెలిచిన జట్టు కూడా నాలుగు పాయింట్లతో భారత్‌తో సమఉజ్జీగా ఉంటుంది. అయితే భారత్‌ రన్‌రేట్‌ చాలా మెరుగ్గా ఉండటంతో శ్రీలంక లేదా పాక్‌ రెండో స్థానానికే పరిమితం కావొచ్చు.

స్పిన్‌తో మొదలైన పతనం
టాస్‌ గెలిచిన కోహ్లి ఫీల్డింగ్‌కు మొగ్గుచూపాడు. దీంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ను డికాక్, ఆమ్లా ప్రారంభించారు. ఇద్దరు జాగ్రత్తగా ఆడటంతో తొలి 10 ఓవర్లలో 35 పరుగులే వచ్చాయి. కోహ్లి స్పిన్నర్లను దించినా...రన్‌రేట్‌ మందగించినా... వికెట్‌ కాపాడుకొని ఓపెనర్లు శుభారంభమిచ్చారు. జట్టు స్కోరు 76 పరుగుల వద్ద ఎట్టకేలకు ఇన్నింగ్స్‌ 18వ ఓవర్లో అశ్విన్‌... ఆమ్లా (54 బంతుల్లో 35; 3 ఫోర్లు, 1 సిక్స్‌) వికెట్‌ తీసి భారత శిబిరంలో ఆనందం నింపాడు. తర్వాత వచ్చిన డుప్లెసిస్‌ (50 బంతుల్లో 36; ఒక ఫోర్‌) కూడా నింపాదిగానే ఆడటంతో 22వ ఓవర్లో జట్టు స్కోరు 100 పరుగులకు చేరింది. డికాక్‌ 68 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తిచేసుకున్నాక ఆ మరుసటి ఓవర్లోనే జడేజా క్లీన్‌బౌల్డ్‌ చేశాడు.

ఇంతదాకా బాగానే ఉన్నా జట్టు స్కోరు 140 పరుగుల వద్ద డివిలియర్స్‌ (16) రనౌట్‌తో మొదలైన పతనం వడివడిగా సఫారీని ముంచేసింది. సమన్వయ లోపంతో ఆ తర్వాతి ఓవర్లోనే మిల్లర్‌ (1) కూడా రనౌట్‌ కాగా, మోరిస్‌ (4), ఫెలుక్‌వాయో (4)లను బుమ్రా ఔట్‌ చేశాడు. రబడ (5), మోర్కెల్‌ (0) భువీ బౌలింగ్‌లో నిష్క్రమించారు. ఫలితంగా 140/2 స్కోరుతో పటిష్టంగా ఉన్న దక్షిణాఫ్రికా 191కే ఆలౌటైంది. ఓవైపు డుమిని (20 నాటౌట్‌) పోరాడుతున్నా మరో ఎండ్‌లో వికెట్ల పతనంతో ఏమీ చేయలేని స్థితి. తాహిర్‌ (1)తో రనౌట్ల సంఖ్య 3కు చేరింది. సఫారీ జట్టు చివరి 8 వికెట్లను కేవలం 51 పరుగుల వ్యవధిలోనే కోల్పోవడం గమనార్హం

‘సూపర్‌’ శిఖర్‌
భారత ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ తన సూపర్‌ ఫామ్‌ కొనసాగించాడు. ఆరో ఓవర్లోనే రోహిత్‌ శర్మ (12) వికెట్‌ పడినప్పటికీ కెప్టెన్‌ కోహ్లితో కలిసి ఇన్నింగ్స్‌ను నడిపించాడు. చేయాల్సిన లక్ష్యం సులువైనదే కావడంతో భారీషాట్లకు వెళ్లకుండా బాధ్యతాయుతంగా ఆడారు. దీంతో భారత్‌ 13వ ఓవర్లో 50 పరుగుల్ని, 21వ ఓవర్లో 100 పరుగుల్ని అధిగమించింది. ప్రత్యర్థి కెప్టెన్‌ బౌలర్లందరిని మార్చిమార్చి ప్రయోగించినా శిఖర్, కోహ్లిల ఏకాగ్రతను దెబ్బతీయలేకపోయారు. ఈ క్రమంలో ముందుగా ధావన్‌ 61 బంతుల్లో, కోహ్లి 71 బంతుల్లో అర్ధసెంచరీలు సాధించారు. లక్ష్యం దిశగా సాగుతున్న తరుణంలో జట్టు స్కోరు 151 పరుగుల వద్ద ధావన్‌ ఔటయ్యాడు. తాహిర్‌ బౌలింగ్‌లో డు ప్లెసిస్‌కు క్యాచ్‌ ఇచ్చి నిష్క్రమించాడు. దీంతో రెండో వికెట్‌కు 128 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. తర్వాత క్రీజులోకి వచ్చిన యువరాజ్, కోహ్లితో కలిసి మిగిలిన లాంఛనాన్ని పూర్తిచేశాడు.

40 ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో సఫారీపై టీమిండియా రికార్డిది. 2000, 2002, 2013, 2017లో గెలిచింది.

51/8 డివిలియర్స్‌ సేన చివరి 8 వికెట్లను 51 పరుగుల వ్యవధిలోనే కోల్పోయింది. ఒక దశలో 140/2తో పటిష్టంగా ఉంది.

6 ఈ టోర్నీలో భారత ఫీల్డర్లు చేసిన రనౌట్లు. ఇంకే జట్టు 2 రనౌట్లను దాటలేదు.

271 ఈ టోర్నీలో శిఖర్‌ ధావన్‌ చేసిన పరుగులివి. ఇంకెవరూ ఇతని దరిదాపుల్లో లేరు.

చాంపియన్స్‌ ట్రోఫీలో నేడు
శ్రీలంక & పాకిస్తాన్‌
వేదిక: కార్డిఫ్,  గ్రూప్‌: ‘బి’,  మ. గం. 3.00 నుంచి స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం


ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు గ్రూప్‌ ‘బి’ నుంచి రెండో సెమీఫైనల్‌ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. ఒకవేళ వర్షం కారణంగా మ్యాచ్‌ రద్దయితే శ్రీలంక, పాక్‌ మూడు పాయింట్లతో సమఉజ్జీగా నిలుస్తాయి. ఈ దశలో మెరుగైన రన్‌రేట్‌ ఉన్న జట్టు ముందంజ వేస్తుంది. ప్రస్తుతం పాక్‌ (–1.544) కంటే శ్రీలంక (–0.879) మెరుగైన రన్‌రేట్‌ కలిగి ఉంది. దాంతో శ్రీలంకకే సెమీఫైనల్‌ బెర్త్‌ అవకాశం ఉంటుంది.


టాగ్లు: Kohli,South Africa,కోహ్లి,దక్షిణాఫ్రికా

మరిన్ని వార్తలు


మ్యాచ్‌లో గొప్ప మలుపు అదే
తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేయడంపై టీమిండియా కెప్టెన్‌ ...

నాకో చాన్స్‌ ఇవ్వండి..
చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో చెత్త ఆటతీరు ప్రదర్శించడంపై దక్షిణాఫ్రికా.. ...

భారత బౌలర్ల అరుదైన రికార్డు
చాంపియన్‌ట్రోఫీలో మరో అరుదైన రికార్డు నమోదైంది ...

సెమీస్‌లోకి విరాట్‌ సేన
గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన ...

సెమీస్లోకి విరాట్ సేన..
గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన ...

టీమిండియా విజృంభణ..
చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టీమిండియా ...

'అవుట్' కోసం పోటీ పడ్డారు!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...

'ఆ క్రికెటర్ ను ప్రతీ జట్టు కోరుకుంటుంది'
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ ...

అశ్విన్ వచ్చేశాడు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...

ఆసీస్‌ కథ కంచికి
చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ...



ఈరోజు ....


  శ్రీలంక
X
  పాకిస్తాన్

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 +1.370
SA 3 1 2 2 +0.167
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.