Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

'ఆ క్రికెటర్ ను ప్రతీ జట్టు కోరుకుంటుంది'

Sports | Updated: Jun 11, 2017 10:14 (IST)


లండన్: చాంపియన్స్ ట్రోఫీలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో సెంచరీతో ఆకట్టుకున్న ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ ప్రశంసల వర్షం కురిపించాడు. ప్రపంచంలోని ప్రతీ క్రికెట్ జట్టు బెన్ స్టోక్స్ లాంటి ఆల్ రౌండర్ ని  కచ్చితంగా కోరుకుంటుందని కొనియాడాడు. ఈ విషయం ఇండియన్ ప్రీమియర్  లీగ్(ఐపీఎల్) వంటి వేలంలో నిరూపించబడిందని మోర్గాన్ ప్రస్తావించాడు.

' బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ల్లో స్టోక్స్ ది ప్రత్యేక స్థానం. అతనొక కీలకమైన ఆల్ రౌండర్. అతను జట్టులో ఉన్నాడంటే భరోసా ఉంటుంది. నిన్నటి మ్యాచ్ లో చాలా పరుగుల్ని స్టోక్స్ సేవ్ చేశాడు. దాంతో పాటు బౌలింగ్ లో కూడా మెరిశాడు. బ్యాటింగ్ లో సెంచరీతో  అదరగొట్టాడు. మా జట్టులో స్టోక్స్ ఉండటం నిజంగా అదృష్టం.  ఏదో రకంగా జట్టుకు ఉపయోగపడుతూనే ఉంటాడు. అతని లాంటి ఆటగాడ్ని ఏ జట్టైనా కోరుకుంటుంది'అని మోర్గాన్ అభిప్రాయపడ్డాడు.

జట్టు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆ భారాన్ని స్టోక్స్ తన భుజాలపై వేసుకుంటాడన్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు స్టోక్స్ చేసిన సెంచరీనే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నాడు. ఆసీస్ తో మ్యాచ్ లో బెన్‌ స్టోక్స్‌ (109 బంతుల్లో 102 నాటౌట్‌; 13 ఫోర్లు, 2 సిక్సర్లు) అజేయ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే.


టాగ్లు: Morgan,ben stokes,champions trophy 2017,మోర్గాన్,బెన్ స్టోక్స్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


మ్యాచ్‌లో గొప్ప మలుపు అదే
తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేయడంపై టీమిండియా కెప్టెన్‌ ...

నాకో చాన్స్‌ ఇవ్వండి..
చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో చెత్త ఆటతీరు ప్రదర్శించడంపై దక్షిణాఫ్రికా.. ...

భారత బౌలర్ల అరుదైన రికార్డు
చాంపియన్‌ట్రోఫీలో మరో అరుదైన రికార్డు నమోదైంది ...

కొట్టేశాం...సఫారీని, సెమీస్‌ బెర్త్‌ని
టీమిండియా సమష్టి ప్రదర్శన ...

కొట్టేశాం...సఫారీని, సెమీస్‌ బెర్త్‌ని
టీమిండియా సమష్టి ప్రదర్శన ...

సెమీస్‌లోకి విరాట్‌ సేన
గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన ...

సెమీస్లోకి విరాట్ సేన..
గ్రూప్-బిలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావో రేవో మ్యాచ్ లో అదరగొట్టిన విరాట్ సేన ...

టీమిండియా విజృంభణ..
చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న కీలక మ్యాచ్ లో టీమిండియా ...

'అవుట్' కోసం పోటీ పడ్డారు!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...

అశ్విన్ వచ్చేశాడు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...



ఈరోజు ....


  శ్రీలంక
X
  పాకిస్తాన్

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 +1.370
SA 3 1 2 2 +0.167
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.