Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

అశ్విన్ వచ్చేశాడు..

Sports | Updated: Jun 11, 2017 09:32 (IST)


లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో భారత జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన విరాట్ కోహ్లి ముందుగా సఫారీలను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ఈ మ్యాచ్ ఇరు జట్లకు కీలకం కావడంతో హోరాహోరీ పోరు జరిగే అవకాశం ఉంది.  దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో భారత జట్టు ఒకే ఒక్క మార్పుతో బరిలోకి దిగుతుంది. గత రెండు మ్యాచ్ లకు దూరమైన రవి చంద్రన్ అశ్విన్ తుది జట్టులోకి వచ్చాడు. దక్షిణాఫ్రికాపై అశ్విన్ కు మంచి రికార్డు ఉండటంతో పాటు, ముగ్గురు లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్ మెన్ ఆ జట్టులో ఉండటం చేత అశ్విన్ తీసుకున్నారు. ఉమేశ్ యాదవ్ స్థానంలో అశ్విన్ జట్టులోకి వచ్చాడు.

 

ఐసీసీ టోర్నీల్లో దక్షిణాఫ్రికాపై  మంచి రికార్డును కల్గి ఉండటం భారత్ కు కలిసొచ్చే అంశం. 12 మ్యాచ్ ల్లో భారత్ ఎనిమిదింట గెలవగా, నాలుగసార్లు ఓడింది. దాంతో పాటు ఇరు జట్ల మధ్య జరిగిన గత నాలుగు మ్యాచ్ ల్లో భారత్ దే పైచేయి కావడం విశేషం.అయితే ఈ మ్యాచ్ విరాట్ సేనకు కచ్చితంగా కఠిన పరీక్షే. శ్రీలంకతో మ్యాచ్ లో భారత్ జట్టు భారీ స్కోరు చేసి కూడా ఓడిపోవడం విమర్శలకు దారిచ్చింది. మరొకవైపు కోచ్ కుంబ్లేతో విభేదాలకు ఫుల్ స్టాప్ పడాలంటే ఇక్కడ గెలుపు అనివార్యం. ఓడితే మాత్రం కోచ్‌ కుంబ్లేతో విభేదాలు, మైదానం బయటి వివాదాలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. ఇప్పుడు వరల్డ్‌ నంబర్‌వన్‌ దక్షిణాఫ్రికా రూపంలో భారత్‌కు సవాల్‌ ఎదురుగా నిలిచింది. అక్కడా కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ తన ఫామ్‌తో తంటాలు పడుతున్నా, పాక్‌ చేతిలో అనూహ్యంగా ఓడినా జట్టుగా సఫారీలు ఎప్పుడైనా ప్రమాదకరమే. ఈ నేపథ్యంలో ఏబీ సేనను దాటి డిఫెండింగ్ చాంపియన్ ముందంజ వేయగలదా? అనేది ఆసక్తికరం.

దక్షిణాఫ్రికా తుది జట్టు: ఏబీ డివిలియర్స్(కెప్టెన్), డీ కాక్, హషీమ్ ఆమ్లా, డుప్లెసిస్, డేవిడ్ మిల్లర్, జేపీ డుమినీ, క్రిస్ మోరిస్, రబడా, ఫెవిలుక్యుయో, మోర్నీ మోర్కెల్, ఇమ్రాన్ తాహీర్

భారత తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, యువరాజ్ సింగ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, కేదర్ జాదవ్, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, రవి చంద్రన్ అశ్విన్, బూమ్రా

 


టాగ్లు: india,south africa,champions trophy 2017,భారత్,దక్షిణాఫ్రికా,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


'ఆ క్రికెటర్ ను ప్రతీ జట్టు కోరుకుంటుంది'
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ ...

ఆసీస్‌ కథ కంచికి
చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ...

‘సఫారీ’ దాటితేనే సెమీస్‌
భారత జట్టుకు ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లి 22 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ...

కెప్టెన్ కోహ్లీకి గంగూలీ కీలక సూచన!
టీమిండియా తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో జట్టులోకి ఓ ఆటగాడిని తీసుకోవాలని కెప్టెన్.. ...

ఒక్క మ్యాచ్‌ గెలువకుండానే..
వన్డే వరల్డ్‌కప్‌ విజేత అయిన ఆస్ట్రేలియా చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి అవమానకరరీతిలో వైదొలిగింది. ...

ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు:కోహ్లి
దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్కు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ ...

అశ్విన్ ను ప్రయోగిస్తారా?
చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ...

ఆసీస్ నిలుస్తుందా?
చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్లు రద్దు ...

సూపర్‌ షకీబ్‌.. వహ్వా మహ్మూద్‌
శతకాలతో రెచ్చిపోయిన జోడి ...

మేమేమీ అజేయులం కాదు!
లంకతో ఓటమిపై కోహ్లి వ్యాఖ్య ...



ఈరోజు ....


  భారత్
X
  దక్షిణాఫ్రికా

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.