Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

మేమేమీ అజేయులం కాదు!

Sports | Updated: Jun 09, 2017 19:39 (IST)


లంకతో ఓటమిపై కోహ్లి వ్యాఖ్య

లండన్‌: ఇటీవలి కాలంలో అన్ని ఫార్మాట్‌లలో వరుస విజయాలతో దూసుకుపోతున్న భారత జట్టుకు శ్రీలంక షాక్‌ ఇచ్చింది. అయితే 8 పటిష్ట జట్లు తలపడుతున్న టోర్నీలో ఇలాంటి ఓటమి సహజమేనని భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి అభిప్రాయ పడ్డాడు. ‘మేం చేసిన స్కోరు విజయానికి సరిపోతుందని అనిపించింది. నిజానికి మా బౌలర్లు కూడా బాగానే బౌలింగ్‌ చేశారు. శ్రీలంక బ్యాట్స్‌మెన్‌ చాలా బాగా ఆడారనే విషయం మరచిపోవద్దు. వారి ప్రదర్శనను కూడా గుర్తించాలి కదా. అయినా మేమేమీ అజేయులం కాదు.

మాకూ పరాజయాలు ఎదురు కావచ్చు’ అని కోహ్లి వ్యాఖ్యానించాడు. తగిన వ్యూహంతో లంక ఆడిన తీరును అభినందిస్తూ ఓటమిని అంగీకరించడం తప్ప మరేమీ చేయలేమని కోహ్లి అన్నాడు. భారత బౌలర్ల ప్రదర్శనను బట్టి చూస్తే దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో అదనంగా మరో 20 పరుగులైనా చేయాల్సి ఉంటుందని విరాట్‌ విశ్లేషించాడు. మధ్య ఓవర్లలో కూడా విధ్వంసకర బ్యాటింగ్‌ చేయడం భారత్‌కు మొదటినుంచి అలవాటు లేదని ఈ సందర్భంగా కోహ్లి గుర్తు చేశాడు.‘50 ఓవర్ల పాటు దూకుడుగా ఆడే జట్టు కాదు మాది. ఆరంభంలో నెమ్మదిగా ఆడి నిలదొక్కుకున్న తర్వాత చివర్లో చెలరేగిపోవడమే మా శైలి’ అని కెప్టెన్‌ అభిప్రాయం వ్యక్తం చేశాడు.  

వరద బాధితులకు అంకితం...
మరోవైపు లంక  కెప్టెన్‌ మాథ్యూస్‌ ‘మా దేశంలో ఇటీవల చోటు చేసుకున్న విషాదం మాటల్లో చెప్పరానిది. వరదల్లో అనేక మంది చనిపోవడంతో దేశం అంతటా ఒక రకమైన బాధాకర వాతావరణం నెలకొని ఉంది. ఇలాంటి స్థితిలో క్రికెట్‌లో మా గెలుపు వారి మొహాల్లో చిరునవ్వులు పూయిస్తుందని ఆశిస్తున్నా’ అని అన్నాడు.


టాగ్లు: Matthews,Virat Kohli,మాథ్యూస్‌,విరాట్‌ కోహ్లి

మరిన్ని వార్తలు


భారత్‌ను ఓడించేందుకు.. మాజీల వ్యూహాలు
పియన్స్‌ ట్రోఫీలో కామెంటేటర్లుగా అవతారమెత్తిన మాజీ క్రికెటర్లు తమ జట్టు విజయాలకు వ్యూహాలు ...

అశ్విన్‌ లోటు కనబడలేదు
చాంపియన్‌ ట్రోఫిలో భారత్‌ ఆడిన రెండు మ్యాచుల్లో అశ్విన్‌ తుది జట్టులో లేకపోయినా.. ...

గంగూలీ.. నీ షర్ట్‌ తీయకు..
చాంపియన్స్‌ ట్రోఫీలో గురువారం భారత్‌-శ్రీలంక మ్యాచ్‌లో కామెంటేటర్స్‌ మధ్య ఓ సరదా.. ...

మిస్టర్ కోహ్లి.. పాక్ ను చూసి నేర్చుకో!
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్.. ...

గెలుస్తామనుకోలేదు: మాథ్యూస్‌
భారత్‌పై దూకుడుగా ఆడాలని తమ మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర చేసిన సూచనలే ...

ధోని 'సిక్సర్ల' రికార్డు!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సాధించాడు. ...

న్యూజిలాండ్ గెలిస్తేనే..!
చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ...

టీమిండియాపై రెచ్చిపోయిన కేఆర్‌కే
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ ...

దారుణ ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే..!
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు శ్రీలంక చేతిలో తొలి ...

మళ్లీ పేలిన సెహ్వాగ్ కామెంట్!
క్రికెట్ నుంచి రిటైరయ్యాక సోషల్ మీడియాలో ఇన్నింగ్స్ ప్రారంభించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  ఆస్ట్రేలియా

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
AUS 2 0 0 2 0.00
BAN 2 0 1 1 -0.40
NZ 2 0 1 1 -1.740

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.