Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

న్యూజిలాండ్ గెలిస్తేనే..!

Sports | Updated: Jun 09, 2017 11:08 (IST)


కార్డిఫ్:చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ఇప్పటివరకూ ఈ టోర్నీలో బోణీ కొట్టని న్యూజిలాండ్ గెలుపు కోసం ఆరాటపడుతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్ లు ఆడిన న్యూజిలాండ్ కు విజయం దక్కలేదు. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్ రద్దు కాగా, ఇంగ్లండ్ తో మ్యాచ్ లో ఓటమి ఎదురైంది. దాంతో గ్రూప్ దశలో ఒక మ్యాచ్ మాత్రమే మిగిలి ఉన్న న్యూజిలాండ్ విజయంపై కన్నేసింది.  శుక్రవారం బంగ్లాదేశ్ త్ జరిగే మ్యాచ్ లో విజయం సాధిస్తేనే న్యూజిలాండ్ సెమీస్ రేసులో నిలిచే అవకాశం ఉంది. ఒకవేళ కానిపక్షంలో న్యూజిలాండ్ ఇంటిదారి పట్టక తప్పదు

 

ఇప్పటికే గ్రూప్-ఎలో ఇంగ్లండ్ సెమీస్ కు చేరగా, రెండో బెర్తు కోసం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఆస్ట్రేలియా ఆడిన రెండు మ్యాచ్ లు వర్షార్పణం కావడంతో ఆ జట్టుకు రెండు పాయింట్లు మాత్రమే లభించాయి. ఇక న్యూజిలాండ్ కేవలం ఒక పాయింట్ తో మాత్రమే ఉంది. ఒకవేళ ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ గెలిస్తే మూడు పాయింట్లు వస్తాయి. అదే సమయంలో రేపు ఇంగ్లండ్ తో జరిగే మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఓడిపోవాలి. అప్పుడే న్యూజిలాండ్ కు అవకాశం ఉంటుంది. ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా అవుట్ ఫీల్డ్ తడిసిపోయి ఉండటంతో మ్యాచ్ గంట ఆలస్యంగా ప్రారంభమైంది.

న్యూజిలాండ్ తుది జట్టు:కేన్ విలియమ్సన్ (కెప్టెన్), మార్టిన్ గప్టిల్, ల్యూక్ రోంచీ, రాస్ టేలర్, బ్రూమ్, నీషమ్, కోరీ అండర్సన్, సాంత్నార్, మిల్నే, సౌథీ, ట్రెంట్ బౌల్ట్


బంగ్లాదేశ్ తుది జట్టు: మష్రఫ్ మోర్తాజ(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, తస్కిన్ అహ్మద్, ముష్పికర్ రహీమ్, షకిబుల్ హసన్, షబ్బిర్ రెహ్మాన్, మొహ్ముదుల్లా, మొసడెక్ హుస్సేన్, రూబెల్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
 


టాగ్లు: india,bangledesh,champions trophy 2017,భారత్,బంగ్లాదేశ్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


టీమిండియాపై రెచ్చిపోయిన కేఆర్‌కే
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ ...

దారుణ ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే..!
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు శ్రీలంక చేతిలో తొలి ...

మళ్లీ పేలిన సెహ్వాగ్ కామెంట్!
క్రికెట్ నుంచి రిటైరయ్యాక సోషల్ మీడియాలో ఇన్నింగ్స్ ప్రారంభించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర ...

దిమ్మ తిరిగింది!
శ్రీలంక చేతిలో భారత్‌ చిత్తు ...

పాక్‌ గెలిచింది
ఇంగ్లండ్‌లో వాన మరో మ్యాచ్‌ను అసంపూర్ణంగానే ముగించింది. ...

ధావన్ దరువు..
చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో ...

రోహిత్-ధావన్ లు నాల్గోసారి..
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి ...

కోహ్లీని మాకు ఇచ్చేయండి..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ నెగ్గడాన్ని ...

సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన టీమిండియా వరుసగా రెండో ...

బోణీ కొట్టిన పాక్..
ద‌క్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో వర్షం తీవ్ర ...



ఈరోజు ....


  న్యూజిలాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
AUS 2 0 0 2 0.00
BAN 2 0 1 1 -0.40
NZ 2 0 1 1 -1.740

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.