Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

పాక్‌ గెలిచింది

Sports | Updated: Jun 08, 2017 18:23 (IST)


బర్మింగ్‌హామ్‌: ఇంగ్లండ్‌లో వాన మరో మ్యాచ్‌ను అసంపూర్ణంగానే ముగించింది. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో బుధవారం పాకిస్తాన్, దక్షిణాఫ్రికాల మధ్య జరిగిన మ్యాచ్‌ను డక్‌వర్త్‌ లూయిస్‌ (డీఎల్‌) పద్ధతే తేల్చింది. డీఎల్‌ ప్రకారం పాక్‌ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. వర్షంతో ఆటనిలిచే సమయానికి పాకిస్తాన్‌ 27 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 119 పరుగులు చేసింది. ఈ మ్యాచ్‌తో అరంగేట్రం చేసిన ఓపెనర్‌ ఫకర్‌ జమాన్‌ (31), వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ (31 నాటౌట్‌) కాస్త మెరుగ్గా ఆడటం ‘డక్‌వర్త్‌’ లెక్కలకు పనికొచ్చింది. ఈ పద్ధతిలో 27 ఓవర్లకు 101 పరుగులు చేస్తే చాలు... అయితే పాక్‌ ఇంకా 19 పరుగులు ముందంజలోనే ఉండటం, వర్షం ఎంతకీ తెరిపినివ్వకపోవడంతో పాక్‌ విజయం ఖాయమైంది.

అయ్యో పాపం సఫారీ: దక్షిణాఫ్రికా దురదృష్టమో... ఈ వాన వైపరీత్యమో కానీ... సఫారీ జయాపజయాల్ని ‘డక్‌వర్త్‌ లూయిస్‌’ కాలరాస్తోంది. గత 11 మ్యాచ్‌ల డీఎల్‌ ఫలితాల్లో 8 సార్లు జట్టు పరాజయాన్నే చవిచూసింది. 2015 నుంచి ఇప్పటి వరకు  ‘డక్‌వర్త్‌’ తేల్చిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ దక్షిణాఫ్రికా గెలవలేకపోయింది.


టాగ్లు: South Africa,Pakistan,Duckworth Lewis,దక్షిణాఫ్రికా,పాకిస్తాన్,డక్‌వర్త్‌ లూయిస్‌

మరిన్ని వార్తలు


ధావన్ దరువు..
చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో ...

రోహిత్-ధావన్ లు నాల్గోసారి..
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి ...

కోహ్లీని ఇచ్చేయండి.. మా జట్టును తీసుకోండి!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ నెగ్గడాన్ని ...

సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన టీమిండియా వరుసగా రెండో ...

బోణీ కొట్టిన పాక్..
ద‌క్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో వర్షం తీవ్ర ...

అశ్విన్‌తో విభేదాలు నిజమే కానీ..
పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా టాప్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు.. ...

కుంబ్లే వైపు ఒక్కడే!
భారత క్రికెట్‌లో ఇది అనూహ్య పరిణామం! దిగ్గజ ఆటగాడైన అనిల్‌ కుంబ్లేను తమ.. ...

దక్షిణాఫ్రికా తడబాటు
పాకిస్తాన్‌ బౌలర్లు సమష్టిగా రాణించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ...

భారత్‌ను ఆపతరమా!
నేడు లంకతో తలపడనున్న భారత్‌ ...

డివిలియర్స్‌ గోల్డెన్‌ డక్‌..
డివిలియర్స్‌ వన్డే కెరీర్‌లో తొలిసారి గోల్డెన్‌ డకౌటయ్యాడు.. ...



ఈరోజు ....


  భారత్
X
  శ్రీలంక

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
AUS 2 0 0 2 0.00
BAN 2 0 1 1 -0.40
NZ 2 0 1 1 -1.740

Group B

P W L PTS NRR
IND 1 1 0 2 3.020
SA 2 1 0 2 1.000
PAK 2 1 1 2 -1.540
SL 1 0 1 0 -1.920

© Copyright Sakshi 2017. All rights reserved.