Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

అశ్విన్‌తో విభేదాలు నిజమే కానీ..: కోహ్లి

Top News | Updated: Jun 08, 2017 04:54 (IST)


లండన్‌: పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా టాప్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు  తుది జట్టులో చోటు లభించలేదు. ఇటీవల జరిగిన టెస్టు సిరీస్‌లో అద్భుతంగా రాణించి.. జట్టుకు వెన్నెముకగా ఉన్న అశ్విన్‌కు తుదిజట్టులో చోటు దక్కకపోవడంపై తాజాగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి స్పందించారు. తుదిజట్టులో స్థానం దక్కకపోవడాన్ని జీర్ణించుకోవడం ఎవరికైనా కష్టమేనని, కానీ జట్టుకూర్పు సమీకరణాలను అశ్విన్‌ అర్థం చేసుకోగలడని కోహ్లి మీడియాతో పేర్కొన్నాడు. టాప్‌ బౌలర్‌ను పక్కనబెట్టాల్సిన రావడం కష్టమే కదా అని మీడియా ప్రశ్నించగా.. అబ్బే అది చాలా సులువు అంటూ కోహ్లి స్పందించాడు.

‘అశ్విన్‌ టాప్‌ క్లాస్‌ బౌలర్‌. అది అందరికీ తెలిసిన విషయం. అతను చాలా ప్రొఫెషనల్‌గా ఉంటాడు. గత మ్యాచ్‌ సంబంధించిన జట్టుకూర్పును అతను బాగా అర్థం చేసుకున్నాడు. దీనిపై అతనికి ఎలాంటి అభ్యంతరమూ లేదు. నువ్వుం ఏం చేసినా నేను అండగా ఉంటానని అతను నాతో చెప్పాడు. మా మధ్య ఉన్న అనుబంధం అది’  అని కోహ్లి వివరించాడు.

అశ్విన్‌తో విభేదాలు ఉన్న మాట వాస్తవమేనని కోహ్లి అంగీకరించాడు. అయితే, ఇవి మైదానంలో అనుసరించే వ్యూహాలపైనే కానీ, జట్టు సెలెక‌్షన్‌ విషయంలో ఎప్పుడూ విభేదాలు తలెత్తలేదని చెప్పాడు. ‘ఔను, మా మధ్య బౌలింగ్‌ ప్లాన్స్‌, ఇతరత్రా విషయాల్లో విభేదాలు ఉన్నాయి. ఎందుకంటే అతను చాలా తెలివైనవాడు. సొంత ప్లాన్స్‌తో మైదానంలోకి అడుగుపెడతాడు. అందువల్ల ఇలాంటి విభేదాలు వస్తుంటాయి’ అని వివరించాడు.
 


టాగ్లు: Virat Kohli,Ravichandran Ashwin,champions trophy 2017,విరాట్‌ కోహ్లి,రవిచంద్రన్‌ అశ్విన్‌,చాంపియన్స్‌ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


ధావన్ దరువు..
చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో ...

రోహిత్-ధావన్ లు నాల్గోసారి..
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి ...

కోహ్లీని ఇచ్చేయండి.. మా జట్టును తీసుకోండి!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ నెగ్గడాన్ని ...

సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన టీమిండియా వరుసగా రెండో ...

బోణీ కొట్టిన పాక్..
ద‌క్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో వర్షం తీవ్ర ...

కుంబ్లే వైపు ఒక్కడే!
భారత క్రికెట్‌లో ఇది అనూహ్య పరిణామం! దిగ్గజ ఆటగాడైన అనిల్‌ కుంబ్లేను తమ.. ...

దక్షిణాఫ్రికా తడబాటు
పాకిస్తాన్‌ బౌలర్లు సమష్టిగా రాణించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ...

భారత్‌ను ఆపతరమా!
నేడు లంకతో తలపడనున్న భారత్‌ ...

డివిలియర్స్‌ గోల్డెన్‌ డక్‌..
డివిలియర్స్‌ వన్డే కెరీర్‌లో తొలిసారి గోల్డెన్‌ డకౌటయ్యాడు.. ...

లండన్‌ వీధుల్లో భారత ఆటగాళ్లు..
ప్రాక్టీస్‌ వ్యూహాలకు వర్షం దెబ్బకొట్టడంతో భారత క్రికెటర్లు మంగళవారం లండన్‌ వీధుల్లో ...



ఈరోజు ....


  భారత్
X
  శ్రీలంక

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
AUS 2 0 0 2 0.00
BAN 2 0 1 1 -0.40
NZ 2 0 1 1 -1.740

Group B

P W L PTS NRR
IND 1 1 0 2 3.020
SA 2 1 0 2 1.000
PAK 2 1 1 2 -1.540
SL 1 0 1 0 -1.920

© Copyright Sakshi 2017. All rights reserved.