Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

బోణీ కొట్టిన పాక్.. మిల్లర్ పోరాటం వృథా

Sports | Updated: Jun 08, 2017 04:22 (IST)


బర్మింగ్ హామ్‌: ద‌క్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ల మధ్య  బుధవారం జరిగిన మ్యాచ్ లో వర్షం తీవ్ర అంతరాయం కలిగిందచింది. దీంతో ఆడిన ఓవర్లు, పరుగులను లెక్కలోకి తీసుకుని డ‌క్‌వ‌ర్త్ లూయిస్ ప‌ద్ధ‌తిలో అంపైర్లు పాక్‌ను విజేత‌గా ప్ర‌క‌టించారు. భారత్‌ చేతిలో ఓటమితో ట్రోఫీ ప్రారంభించిన పాక్‌కు తొలి విజ‌యం దక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికాను నిర్ణీత ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 219 పరుగులకే పాక్ బౌలర్లు కట్టడి చేశారు. లక్ష్య ఛేదనకు దిగిన పాక్ ఇన్నింగ్స్ మధ్యలోనే వరుణుడు మ్యాచ్‌ను అడ్డుకున్నాడు. మ్యాచ్ నిలిపివేసే సమయానికి పాక్ 27 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 119 పరుగులు చేసింది. తిరిగి మ్యాచ్ ప్రారంభించే అవకాశం లేకపోవడంతో డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం పాక్ ఆడిన ఓవర్లలో మెరుగైన రన్ రేట్ ప్రకారం దక్షిణాఫ్రికాపై 19 ప‌రుగుల తేడాతో నెగ్గింది.

పాక్ ఓపెనర్లు అజహర్‌ అలీ (9), ఫకార్ జమాన్‌ (31)లతో పాటు మహ్మద్‌ హఫీజ్‌ (26)లు ఔట్ కాగా.. బాబర్‌ అజామ్‌ (31 బ్యాటింగ్‌), షోయబ్‌ మాలిక్‌ (16 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. సఫారీ బౌలర్ మోర్ని మోర్కెల్ ఈ మూడు వికెట్లు తీశాడు. ఓపెనర్లు ఒకే ఓవర్లు ఔటయ్యాక బాబర్ అజామ్‌తో కలిసి మూడో వికెట్‌కు 53 పరుగులు జోడించిన తర్వాత హఫీజ్‌ను కూడా మోర్కెల్ బౌలింగ్‌లోనే వెనుదిరిగాడు. ఓపెనర్ జమాన్, షోయబ్ మాలిక్ వేగంగా ఆడకపోతే డక్‌వర్త్ లూయిస్ ప్రకారం పాక్ కు గట్టి దెబ్బ తగిలేది.

మిల్లర్ పోరాటం వృథా
మ్యాన్ ఆఫ్‌ ది మ్యాచ్ వీరుడు హసన్‌ అలీ (3/24), ఇమాద్‌ వసీమ్‌ (2/20), జునైద్‌ ఖాన్‌ (2/53)ల ధాటికి సఫారీ జట్టు ఓ దశలో 118 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఓపెనర్ క్వింటన్ డికాక్‌ (33) పరవాలేదనిపించగా, హషీం ఆమ్లా (16), డివిలియర్స్‌ (0), డుమిని (8) విఫలమయ్యారు. జట్టును ఆదుకునే ప్రయత్నంలో డుప్లెసిస్‌ (26) ఔటయ్యాడు. హాఫ్ సెంచరీ వీరుడు డేవిడ్‌ మిల్లర్‌ (75 నాటౌట్‌; 104 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) క్రిస్ మోరిస్‌ (28), రబాడ (26)లతో కలిసి పోరాటం చేయడంతో దక్షిణాఫ్రికా 200 పైచిలుకు స్కోరు చేయగలిగింది. మొదట పాక్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్, ఆపై బ్యాట్స్‌మెన్ మెరుగైన రన్‌రేట్ తో పరుగులు చేయడం వల్ల డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 19 పరుగుల తేడాతో విజయం సాధించి పాక్ బోణీ కొట్టింది.


టాగ్లు: ICC Champions Trophy,Pakistan,South Africa,ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ,పాకిస్తాన్,దక్షిణాఫ్రికా

మరిన్ని వార్తలు


రోహిత్-ధావన్ లు నాల్గోసారి..
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి ...

కోహ్లీని ఇచ్చేయండి.. మా జట్టును తీసుకోండి!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ నెగ్గడాన్ని ...

సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన టీమిండియా వరుసగా రెండో ...

అశ్విన్‌తో విభేదాలు నిజమే కానీ..
పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా టాప్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు.. ...

కుంబ్లే వైపు ఒక్కడే!
భారత క్రికెట్‌లో ఇది అనూహ్య పరిణామం! దిగ్గజ ఆటగాడైన అనిల్‌ కుంబ్లేను తమ.. ...

దక్షిణాఫ్రికా తడబాటు
పాకిస్తాన్‌ బౌలర్లు సమష్టిగా రాణించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ...

భారత్‌ను ఆపతరమా!
నేడు లంకతో తలపడనున్న భారత్‌ ...

డివిలియర్స్‌ గోల్డెన్‌ డక్‌..
డివిలియర్స్‌ వన్డే కెరీర్‌లో తొలిసారి గోల్డెన్‌ డకౌటయ్యాడు.. ...

లండన్‌ వీధుల్లో భారత ఆటగాళ్లు..
ప్రాక్టీస్‌ వ్యూహాలకు వర్షం దెబ్బకొట్టడంతో భారత క్రికెటర్లు మంగళవారం లండన్‌ వీధుల్లో ...

భారత్‌పై దూకుడుగా ఆడాల్సిందే
భారత్‌తో గురువారం జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లో శ్రీలంక ఆటతీరు దూకుడుగా ఉండాల్సిందేనని ...



ఈరోజు ....


  భారత్
X
  శ్రీలంక

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
AUS 2 0 0 2 0.00
BAN 2 0 1 1 -0.40
NZ 2 0 1 1 -1.740

Group B

P W L PTS NRR
IND 1 1 0 2 3.020
SA 2 1 0 2 1.000
PAK 2 1 1 2 -1.540
SL 1 0 1 0 -1.920

© Copyright Sakshi 2017. All rights reserved.