Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

కుంబ్లే వైపు ఒక్కడే!

Sports | Updated: Jun 07, 2017 19:21 (IST)


వ్యతిరేకంగా 10 మంది ఆటగాళ్లు   

ముంబై: భారత క్రికెట్‌లో ఇది అనూహ్య పరిణామం! దిగ్గజ ఆటగాడైన అనిల్‌ కుంబ్లేను తమ కోచ్‌గా చూసేందుకు మాత్రం భారత ఆటగాళ్లు ఎవరూ ఇష్ట పడటం లేదు. కొత్తగా బయటపడిన సమాచారం ప్రకారం ప్రస్తుత టీమ్‌ నుంచి ఒక్క ఆటగాడు మాత్రమే కుంబ్లేను సమర్థిస్తుండగా, ఏకంగా పది మంది అతడిని కొనసాగించడాన్ని వ్యతిరేకిస్తుండటం గమనార్హం! బీసీసీఐ వర్గాలు చెప్పిన సమాచారం ప్రకారం ‘ఆటగాళ్ల అలసట, గాయాలువంటి సమస్యలను చక్కబెట్టడంలో కుంబ్లే చాలా కఠినంగా, అమానవీయంగా వ్యవహరించారు’ అని ఆ ఆటగాళ్లు ఫిర్యాదు చేశారు.

అసలు కుంబ్లే కఠిన వైఖరి వల్లే తాను బలవంతంగా సర్జరీ చేయించుకోవాల్సి వచ్చిందని కూడా ఒక ఆటగాడు ఆరోపించినట్లు తెలిసింది. బీసీసీఐ తాత్కాలిక కార్యదర్శి అమితాబ్‌ చౌదరి, జనరల్‌ మేనేజర్‌ ఎంవీ శ్రీధర్‌తో పాటు సౌరవ్‌ గంగూలీ కూడా గత వారం ఆటగాళ్లతో విడివిడిగా మాట్లాడారు. ‘పాత కోచ్‌ కిర్‌స్టెన్‌ ఆటగాళ్లతో స్నేహితుడిలా వ్యవహరిస్తూ ఏం మాట్లాడినా రహస్యంగానే ఉంచేవారు. కానీ కుంబ్లే మాత్రం తన క్రమశిక్షణ గురించి పదే పదే చెబుతూ కూడా ఆటగాళ్లతో మాట్లాడిన అంశాలను బయటికి చేరవేస్తున్నారు’ అని ఒక ఆటగాడు చెప్పడం సమస్య తీవ్రతను చూపిస్తోంది. 


టాగ్లు: Anil Kumble,BCCI,అనిల్‌ కుంబ్లే,బీసీసీఐ

మరిన్ని వార్తలు


కోహ్లీని ఇచ్చేయండి.. మా జట్టును తీసుకోండి!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ నెగ్గడాన్ని ...

సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన టీమిండియా వరుసగా రెండో ...

బోణీ కొట్టిన పాక్..
ద‌క్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో వర్షం తీవ్ర ...

అశ్విన్‌తో విభేదాలు నిజమే కానీ..
పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా టాప్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు.. ...

దక్షిణాఫ్రికా తడబాటు
పాకిస్తాన్‌ బౌలర్లు సమష్టిగా రాణించారు. దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ...

భారత్‌ను ఆపతరమా!
నేడు లంకతో తలపడనున్న భారత్‌ ...

డివిలియర్స్‌ గోల్డెన్‌ డక్‌..
డివిలియర్స్‌ వన్డే కెరీర్‌లో తొలిసారి గోల్డెన్‌ డకౌటయ్యాడు.. ...

లండన్‌ వీధుల్లో భారత ఆటగాళ్లు..
ప్రాక్టీస్‌ వ్యూహాలకు వర్షం దెబ్బకొట్టడంతో భారత క్రికెటర్లు మంగళవారం లండన్‌ వీధుల్లో ...

భారత్‌పై దూకుడుగా ఆడాల్సిందే
భారత్‌తో గురువారం జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లో శ్రీలంక ఆటతీరు దూకుడుగా ఉండాల్సిందేనని ...

తీవ్ర నిరాశ కలిగించింది!
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ ఫలితంపై స్మిత్‌ ...



ఈరోజు ....


  భారత్
X
  శ్రీలంక

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
AUS 2 0 0 2 0.00
BAN 2 0 1 1 -0.40
NZ 2 0 1 1 -1.740

Group B

P W L PTS NRR
IND 1 1 0 2 3.020
SA 2 1 0 2 1.000
PAK 2 1 1 2 -1.540
SL 1 0 1 0 -1.920

© Copyright Sakshi 2017. All rights reserved.