Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

ధావన్ దరువు..

Sports | Updated: Jun 08, 2017 13:20 (IST)


లండన్: చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో మెరిశాడు. శిఖర్ ధావన్ 112 బంతుల్లో 13 ఫోర్లతో సెంచరీ సాధించి సత్తాచాటుకున్నాడు. లంక బౌలర్లను సమర్ధవంతంగా ఎదుర్కొంటూ తన బ్యాటింగ్ లో హవాను కొనసాగించాడు. తొలుత 69 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కును చేరిన ధావన్.. మరో అర్ధ శతకం సాధించడానికి 43 బంతులను ఎదుర్కొన్నాడు.  దాంతో తన వన్డే కెరీర్ లో 10వ సెంచరీను సాధించాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ జట్టుకు శిఖర్ ధావన్-రోహిత్ శర్మ లు శుభారంభం అందించారు.ఈ జోడి 138 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత జట్టుకు మంచి ఆరంభాన్నిచ్చింది. ఈ క్రమంలోనే ముందుగా రోహిత్ శర్మ 58 బంతుల్లో 4 ఫోర్లు, 1సిక్సర్ సాయంతో హాఫ్ సెంచరీ సాధించగా, ఆపై శిఖర్ ధావన్ అర్ధ శతకాన్ని నమోదు చేశాడు.

వీరిద్దరూ రాణించి చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సార్లు సెంచరీ భాగస్వామ్యాలు(నాలుగుసార్లు) నమోదు చేసిన రికార్డును మరింత మెరుగుపరుచుకున్నారు.పాకిస్తాన్ తో జరిగిన గత మ్యాచ్ లో వీరిద్దరూ 136 పరుగులు సాధించి చాంపియన్స్ ట్రోఫీలో మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన సంగతి తెలిసిందే. తద్వారా చాంపియన్స్ ట్రోఫీలో అత్యధిక సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన జోడిగా రికార్డు సృష్టించింది. అయితే తాజాగా లంకేయులతో మ్యాచ్ లో సైతం సెంచరీ భాగస్వామ్యాన్ని సాధించడంతో ఈ ఘనతను నాల్గోసారి తన ఖాతాలో వేసుకుంది. మరోవైపురోహిత్-ధావన్ ల జోడి మరో ఘనతను కూడా సొంతం చేసుకుంది. వరుసగా వన్డేల్లో భారత తరపున మూడుసార్లు సెంచరీ భాగస్వామ్యాలు నమోదు చేసిన తొలి జో్డిగా సరికొత్త ఘనత సాధించింది. ఈ టోర్నీలో రెండు సెంచరీ భాగస్వామ్యాలతో పాటు అంతకుముందు ఆస్ట్రేలియాతో్ ఆడిన వన్డేలో శిఖర్-రోహిత్ ల జోడి 123 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించింది.

 

ఇదిలా ఉంచితే, లంకతో మ్యాచ్ లో రోహిత్ శర్మ తొలి వికెట్ గా అవుటైనప్పటికీ శిఖర్ మాత్రం మరింత బాధ్యతాయుతంగా ఆడాడు. ధోనితో కలిసి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. వీరిద్దరూ 82 పరుగుల జత చేసిన తరువాత శిఖర్ (125; 128 బంతుల్లో 15 ఫోర్లు, 1 సిక్స్) అవుటయ్యాడు.


టాగ్లు: india,shikhar dhawan,champions trophy 2017,భారత్,శిఖర్ ధావన్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


దారుణ ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే..!
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు శ్రీలంక చేతిలో తొలి ...

మళ్లీ పేలిన సెహ్వాగ్ కామెంట్!
క్రికెట్ నుంచి రిటైరయ్యాక సోషల్ మీడియాలో ఇన్నింగ్స్ ప్రారంభించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర ...

దిమ్మ తిరిగింది!
శ్రీలంక చేతిలో భారత్‌ చిత్తు ...

పాక్‌ గెలిచింది
ఇంగ్లండ్‌లో వాన మరో మ్యాచ్‌ను అసంపూర్ణంగానే ముగించింది. ...

రోహిత్-ధావన్ లు నాల్గోసారి..
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి ...

కోహ్లీని ఇచ్చేయండి.. మా జట్టును తీసుకోండి!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ నెగ్గడాన్ని ...

సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన టీమిండియా వరుసగా రెండో ...

బోణీ కొట్టిన పాక్..
ద‌క్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో వర్షం తీవ్ర ...

అశ్విన్‌తో విభేదాలు నిజమే కానీ..
పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా టాప్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు.. ...

కుంబ్లే వైపు ఒక్కడే!
భారత క్రికెట్‌లో ఇది అనూహ్య పరిణామం! దిగ్గజ ఆటగాడైన అనిల్‌ కుంబ్లేను తమ.. ...



ఈరోజు ....


  న్యూజిలాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
AUS 2 0 0 2 0.00
BAN 2 0 1 1 -0.40
NZ 2 0 1 1 -1.740

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.