Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

దారుణ ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే..!

Sports | Updated: Jun 09, 2017 04:18 (IST)


లండన్‌: చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు శ్రీలంక చేతిలో తొలి పరాభవం ఎదురైంది. గురువారం ఇక్కడి ఓవల్ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ సేనపై లంక 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. లంకేయులను తేలికగా తీసుకుని భారీ మూల్యం చెల్లించుకుంది. ఓటమి అనంతరం కోహ్లీ మాట్లాడుతూ.. 'మా బౌలర్లను ఎంతగానో నమ్మాను. 322 పరుగులంటే సాధారణ లక్ష్యమేం కాదు. బౌలర్లు ఎలాగైనా గెలిపిస్తారని భావించాను. కానీ అలా జరగలేదు. శ్రీలంక అద్భుతంగా బ్యాటింగ్ చేసింది. వారి టైమింగ్ తో పాటు షాట్ సెలక్షన్ కూడా బాగుంది.

పాక్‌పై రాణించిన బౌలర్లు ఈ మ్యాచ్‌లో పూర్తిగా తేలిపోయారు. లంకేయులు బ్యాట్‌తో చక్కని ప్రదర్శన చేయడమే ఇందుకు కారణమని భావిస్తున్నాను. కుషాల్‌ మెండిస్‌ (93 బంతుల్లో 89; 11 ఫోర్లు, 1 సిక్స్‌), ధనుష్క గుణతిలక (72 బంతుల్లో 76; 7 ఫోర్లు, 2 సిక్సర్లు) లు మా నుంచి మ్యాచ్‌ను దూరం చేశారు. మూడొందలకు పైచిలుకు స్కోరును కాపాడుకుంటామని భావించినా నిరాశే ఎదురైంది. బౌలర్లు తమ ఆలోచనకు మరింత పదును పెడితే ఈ పరిస్థితి తలెత్తేది కాదని' అభిప్రాయపడ్డాడు. భారత్ తమ చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై నెగ్గితేనే సెమీస్ చేరుతుంది. గ్రూప్ బి లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, శ్రీలంక జట్లు చెరో మ్యాచ్ నెగ్గడంతో.. ఇంకో మ్యాచ్ నెగ్గిన రెండు జట్లు సెమీస్ చేరతాయి.


టాగ్లు: Champions Trophy,Team India,Sri lanka,virat kohli,చాంపియన్స్‌ ట్రోఫీ,టీమిండియా,భారత్,శ్రీలంక,విరాట్ కోహ్లీ

మరిన్ని వార్తలు


టీమిండియాపై రెచ్చిపోయిన కేఆర్‌కే
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ ...

మళ్లీ పేలిన సెహ్వాగ్ కామెంట్!
క్రికెట్ నుంచి రిటైరయ్యాక సోషల్ మీడియాలో ఇన్నింగ్స్ ప్రారంభించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర ...

దిమ్మ తిరిగింది!
శ్రీలంక చేతిలో భారత్‌ చిత్తు ...

పాక్‌ గెలిచింది
ఇంగ్లండ్‌లో వాన మరో మ్యాచ్‌ను అసంపూర్ణంగానే ముగించింది. ...

ధావన్ దరువు..
చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో ...

రోహిత్-ధావన్ లు నాల్గోసారి..
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి ...

కోహ్లీని మాకు ఇచ్చేయండి..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ నెగ్గడాన్ని ...

సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన టీమిండియా వరుసగా రెండో ...

బోణీ కొట్టిన పాక్..
ద‌క్షిణాఫ్రికా, పాకిస్తాన్‌ల మధ్య బుధవారం జరిగిన మ్యాచ్ లో వర్షం తీవ్ర ...

అశ్విన్‌తో విభేదాలు నిజమే కానీ..
పాకిస్థాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా టాప్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌కు.. ...



ఈరోజు ....


  న్యూజిలాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
AUS 2 0 0 2 0.00
BAN 2 0 1 1 -0.40
NZ 2 0 1 1 -1.740

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.