Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

టీమిండియాపై, కోహ్లీపై రెచ్చిపోయిన కేఆర్‌కే

Sports | Updated: Jun 09, 2017 08:35 (IST)


ముంబై: వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ (కేఆర్‌కే) మరో వివాదానికి తెరతీశాడు. శ్రీలంక చేతిలో ఓటమిని విరాట్ కోహ్లీ సేన జీర్ణించుకోలేక ఉన్న నేపథ్యంలో.. పుండు మీద కారం చల్లినట్లుగా కోహ్లీ సహా జట్టు మీద విమర్శలు గుప్పించాడు. శిఖర్ ధావన్ శతకానికి రోహిత్ శర్మ, ఎంఎస్ ధోనీలు హాఫ్ సెంచరీలు జోడించడంతో భారత్ 321 పరుగుల భారీ స్కోరు చేసి ఓడిపోవడాన్ని కేఆర్‌కే తప్పుపడుతూ వరుస ట్వీట్లతో రెచ్చిపోయాడు.

'కోహ్లీ ఓ మోసగాడు. విజయ్ మాల్యాతో కలిసి పార్టీలు చేసుకుంటే ఫలితం ఇలాగే ఉంటుంది. అయినా డకౌట్ అయిన కోహ్లీ.. ఇంకా స్కోరు చేసి ఉంటే బాగుండేది. అందుకోసం మాల్యాను పిలుస్తే బాగుంటుంది. ఇదివరకే దక్షిణాఫ్రికా పాక్ చేతిలో ఓటమితో రగిలిపోతోంది. ఆ జట్టు వరుసగా రెండు మ్యాచ్‌లలో ఓడిపోతుందని భావించను. భారత్ తన తదుపరి మ్యాచ్ సఫారీలతో ఆడాల్సి ఉంటుంది. ఈ రోజు అంతా తేలిపోయింది. టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ నెగ్గదు. ఒకవేళ సఫారీలను ఓడించినా.. సెమీస్‌లో గానీ, లేక చివరి మెట్టు ఫైనల్లోనైనా భారత్ బోల్తా కొట్టడం ఖాయమని శాపనార్థాలు పెడుతూ' వివాదాస్పదుడు కేఆర్‌కే వరుస ట్వీట్లు చేశాడు.

'రెండు కోట్ల జనాభా ఉన్న లంకలో 11 మంది చాంపియన్లు దొరికారు. కానీ 130 కోట్ల భారత జనాభాలో 11 మంది విన్నర్లను బీసీసీఐ గుర్తించలేక పోయింది. ఇది కలియుగం కనుక రావణులే గెలుస్తారని లంకేయులు నిరూపించారని' కేఆర్‌కే ట్వీట్ల పర్వం కొనసాగింది. మరోవైపు కేఆర్‌కే తీరుపై భారత క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు.


టాగ్లు: Champions Trophy,Team India,Sri lanka,virat kohli,Kamaal Rashid Khan,చాంపియన్స్‌ ట్రోఫీ,టీమిండియా,భారత్,శ్రీలంక,విరాట్ కోహ్లీ,కమల్ రషీద్ ఖాన్

మరిన్ని వార్తలు


ధోని 'సిక్సర్ల' రికార్డు!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సాధించాడు. ...

న్యూజిలాండ్ గెలిస్తేనే..!
చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ...

దారుణ ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే..!
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు శ్రీలంక చేతిలో తొలి ...

మళ్లీ పేలిన సెహ్వాగ్ కామెంట్!
క్రికెట్ నుంచి రిటైరయ్యాక సోషల్ మీడియాలో ఇన్నింగ్స్ ప్రారంభించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర ...

దిమ్మ తిరిగింది!
శ్రీలంక చేతిలో భారత్‌ చిత్తు ...

పాక్‌ గెలిచింది
ఇంగ్లండ్‌లో వాన మరో మ్యాచ్‌ను అసంపూర్ణంగానే ముగించింది. ...

ధావన్ దరువు..
చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో ...

రోహిత్-ధావన్ లు నాల్గోసారి..
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి ...

కోహ్లీని మాకు ఇచ్చేయండి..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ నెగ్గడాన్ని ...

సెమీస్‌ బెర్తే లక్ష్యంగా విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన టీమిండియా వరుసగా రెండో ...



ఈరోజు ....


  న్యూజిలాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
AUS 2 0 0 2 0.00
BAN 2 0 1 1 -0.40
NZ 2 0 1 1 -1.740

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.