Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

గెలుస్తామనుకోలేదు: మాథ్యూస్‌

Sports | Updated: Jun 09, 2017 11:43 (IST)


లండన్‌: భారత్‌పై దూకుడుగా ఆడాలని తమ మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర చేసిన సూచనలే గెలుపుకు కారణమయ్యాయని ఆ జట్టు కెప్టెన్‌ ఎంజెలో మాథ్యూస్‌ అభిప్రాయపడ్డాడు. గురువారం భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 7 వికెట్ల తేడాతో సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్‌ అనంతరం మీడియాతో మాట్లాడిన మాథ్యూస్‌ ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగామని, ఈ విజయం ఎంతో సంతోషాన్ని ఇచ్చిందన్నాడు. ఒత్తిడిలో ఉన్న మేము భారత్‌తో మ్యాచ్‌ గెలుస్తామనుకోలేదన్నాడు. కానీ  సాయశక్తుల పోరాడాలని, స్వేచ్ఛగా ఆడాలని నిర్ణయించుకున్నట్లు మాథ్యూస్‌ తెలిపాడు. గత కొద్దీ కాలముగా విజయాలు లేని మాకు ఈ విజయం ఊరటనిచ్చిందన్నాడు.

మ్యాచ్‌కు రెండు రోజుల ముందు సంగక్కర యువ ఆటగాళ్లకు బ్యాటింగ్‌లో మెళుకవలు సూచించాడని, వాటిని యువ ఆటగాళ్లు అమలుపరిచారని అదే గెలుపుకు కారణమైందని మాథ్యూస్‌ తెలిపాడు. కుసాల్‌ మెండీస్‌(89) రాణించడానికి సంగక్కర బ్యాటింగ్‌ సూచనలే కారణమన్నాడు.  మెండీస్‌, గుణతిలకాల 159 పరుగుల భాగస్వామ్యం కీలకమని ఈ యువ ఆటగాళ్లను కొనియాడాడు. స్వేచ్ఛగా దూకుడుగా ఆడామని అదే గెలిపించిందని అభిప్రాయపడ్డాడు.

తొడ నరాలు పట్టుకొని బాధపడుతున్న కుసాల్‌ పెరారా(47)ను కెప్టెన్‌గా రిటైర్డ్‌ హాట్‌గా పంపిచానని, ఆసమయంలో ఫలితం గురించి ఆలోచించలేదన్నాడు. ఫలితం వేరేలా ఉంటే నాపై విమర్శలు వస్తాయని తెలుసని, కానీ కఠిన పరిస్థితుల్లో కఠిన నిర్ణయాలు తీసుకోక తప్పదని మాథ్యూస్‌ అభిప్రాయపడ్డాడు.  ఈ గెలుపుతో సెమీస్‌ రేసులో ఉన్నామని, తర్వాతి మ్యాచ్‌కు కూడా ఇదే ప్రణాళిక అమలు చేస్తామన్నాడు. గెలుపుపై ఎలాంటి అంచనాలు లేకుండా బరిలోకి దిగుతామని మాథ్యూస్‌ పేర్కొన్నాడు.


టాగ్లు: Champions Trophy,India-SriLanka,Mathews,చాంపియన్స్‌ ట్రోఫీ,భారత్‌-శ్రీలంక,మాథ్యూస్‌

మరిన్ని వార్తలు


ధోని 'సిక్సర్ల' రికార్డు!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సాధించాడు. ...

న్యూజిలాండ్ గెలిస్తేనే..!
చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ...

టీమిండియాపై రెచ్చిపోయిన కేఆర్‌కే
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ ...

దారుణ ఓటమిపై కోహ్లీ ఏమన్నాడంటే..!
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన టీమిండియాకు శ్రీలంక చేతిలో తొలి ...

మళ్లీ పేలిన సెహ్వాగ్ కామెంట్!
క్రికెట్ నుంచి రిటైరయ్యాక సోషల్ మీడియాలో ఇన్నింగ్స్ ప్రారంభించిన డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర ...

దిమ్మ తిరిగింది!
శ్రీలంక చేతిలో భారత్‌ చిత్తు ...

పాక్‌ గెలిచింది
ఇంగ్లండ్‌లో వాన మరో మ్యాచ్‌ను అసంపూర్ణంగానే ముగించింది. ...

ధావన్ దరువు..
చాంపియన్స్ ట్రోఫీలో శ్రీలంకతో మ్యాచ్ లో భారత ఓపెనర్ శిఖర్ ధావన్ సెంచరీతో ...

రోహిత్-ధావన్ లు నాల్గోసారి..
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఓపెనింగ్ జోడి రోహిత్ శర్మ-శిఖర్ ధావన్ల జోడి మరోసారి ...

కోహ్లీని మాకు ఇచ్చేయండి..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా గత ఆదివారం జరిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై భారత్ నెగ్గడాన్ని ...



ఈరోజు ....


  న్యూజిలాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
AUS 2 0 0 2 0.00
BAN 2 0 1 1 -0.40
NZ 2 0 1 1 -1.740

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.