Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

‘సఫారీ’ దాటితేనే సెమీస్‌

Sports | Updated: Jun 11, 2017 08:36 (IST)


భారత్‌కు చావోరేవో 
నేడు దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌ 
గెలిస్తే సెమీఫైనల్‌కు 
చాంపియన్స్‌ ట్రోఫీ    


భారత జట్టుకు ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లి 22 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే ఇంతటి పరీక్షను ఎప్పుడూ ఎదుర్కోలేదు. ఐసీసీ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన జట్టు సెమీస్‌ చేరేందుకు ఇప్పుడు కచ్చితంగా విజయం సాధించాల్సిన స్థితి. లంక చేతిలో ఊహించని పరాజయం జట్టు పరిస్థితిని ఇబ్బందికరంగా మార్చింది.

మరోసారి ఓడితే మాత్రం కోచ్‌ కుంబ్లేతో విభేదాలు, మైదానం బయటి వివాదాలు ఒక్కసారిగా ఉక్కిరిబిక్కిరి చేయడం ఖాయం. ఇప్పుడు వరల్డ్‌ నంబర్‌వన్‌ దక్షిణాఫ్రికా రూపంలో భారత్‌కు సవాల్‌ ఎదురుగా నిలిచింది. అక్కడా కెప్టెన్‌ ఏబీ డివిలియర్స్‌ తన ఫామ్‌తో తంటాలు పడుతున్నా, పాక్‌ చేతిలో అనూహ్యంగా ఓడినా జట్టుగా సఫారీలు ఎప్పుడైనా ప్రమాదకరమే. ఈ నేపథ్యంలో ఏబీ సేనను దాటి కోహ్లి బృందం ముందంజ వేయగలదా? లేక తలవంచి సెమీస్‌కు ముందే ఇంటిదారి పడుతుందా?  

లండన్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో భారత జట్టు కీలక పోరుకు సన్నద్ధమైంది. టోర్నీలో సెమీఫైనల్లోకి అడుగు పెట్టాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్‌లో నేడు (ఆదివారం) భారత్, దక్షిణాఫ్రికాతో తలపడుతోంది. గ్రూప్‌ ‘బి’లో క్వార్టర్‌ ఫైనల్‌లాంటి ఈ మ్యాచ్‌ విజేత సెమీస్‌ చేరుకుంటే, ఓడిన టీమ్‌ టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది.
 
అశ్విన్‌కు చోటు: మేం తర్వాతి మ్యాచ్‌లో కనీసం మరో 20 పరుగులైనా అదనంగా చేయాలి... లంకతో ఓటమి తర్వాత కోహ్లి వ్యాఖ్య ఇది. 321 పరుగులు చేసి కూడా ఓడిన టీమిండియా, దక్షిణాఫ్రికాలాంటి పటిష్ట జట్టుపై మరిన్ని పరుగులు సాధించాలంటే బ్యాట్స్‌మెన్‌ చెలరేగాలి. అదృష్టవశాత్తూ రెండు మ్యాచ్‌లలో కూడా మన బ్యాటింగ్‌ మెరిసింది. ఓపెనర్లు రోహిత్, ధావన్‌ శుభారంభం ఇస్తుండగా పాక్‌తో యువరాజ్, కోహ్లి సత్తా చాటారు. ధోని కూడా గత మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చాడు.

ఇక జాదవ్, పాండ్యా కూడా కీలకంగా మారారు. కాబట్టి బ్యాటింగ్‌ గురించి జట్టుకు బెంగ లేదు. ముందుగా బ్యాటింగ్‌ చేస్తే ఈ వికెట్‌పై భారీ స్కోరు సాధించడమే భారత్‌ లక్ష్యం. అయితే బౌలింగ్‌లో మాత్రం ఒక మార్పు ఖాయంగా కనిపిస్తోంది. గత రెండు మ్యాచ్‌లలో పెవిలియన్‌కే పరిమితమైన స్పిన్నర్‌ అశ్విన్‌ ఈ మ్యాచ్‌ బరిలోకి దిగవచ్చు. లంకతో మన పేసర్లు ముగ్గురు విఫలం కాగా, జడేజా కూడా తేలిపోయాడు. అయితే బ్యాటింగ్‌తో పాటు మెరుపు ఫీల్డింగ్‌ జడేజాకు అదనపు బలం. కాబట్టి ఒక పేసర్‌ను పక్కన పెట్టి అశ్విన్‌ను తీసుకోవచ్చు.

ఏబీ ఫిట్‌: దక్షిణాఫ్రికా కెప్టెన్‌ డివిలియర్స్‌ ఈ మ్యాచ్‌ కోసం పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు ప్రకటించాడు. టోర్నీ తొలి రెండు మ్యాచ్‌లలో ఘోరంగా విఫలమైన అతను, ఈ సారైనా చెలరేగుతాడని జట్టు ఆశాభావంతో ఉంది. ఎలాగైనా ఒక ఐసీసీ టోర్నీ విజయంతో తన కెరీర్‌ను ముగిస్తానని ప్రకటించి టెస్టులకు కూడా దూరంగా ఉంటూ వచ్చిన డివిలియర్స్‌ తన ఆటను, నాయకత్వ పటిమను ప్రదర్శించాల్సిన సమయమిది. పాక్‌తో జరిగిన ఆ మ్యాచ్‌లో మిల్లర్‌ మినహా ఇతర బ్యాట్స్‌మెన్‌ అంతా విఫలమయ్యారు. ఈ నేపథ్యంలో ఓపెనర్లు ఆమ్లా, డి కాక్‌లతో పాటు సీనియర్లు డు ప్లెసిస్, డుమిని కూడా కీలక ఇన్నింగ్స్‌లు ఆడాల్సి ఉంది. అటు దక్షిణాఫ్రికా బౌలింగ్‌ కూడా మరీ ప్రమాదకరం కాదు. మోర్కెల్‌ పాక్‌తో రాణించినా... అతనితో పాటు ఇతర బౌలర్లకు కూడా భారత్‌పై చెప్పుకోదగ్గ రికార్డు లేదు.

తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్‌:  కోహ్లి (కెప్టెన్‌), రోహిత్, ధావన్, యువరాజ్, ధోని, జాదవ్, పాండ్యా, జడేజా, ఉమేశ్‌/అశ్విన్, భువనేశ్వర్, బుమ్రా.
దక్షిణాఫ్రికా:  డివిలియర్స్‌ (కెప్టెన్‌), డి కాక్, ఆమ్లా, డు ప్లెసిస్, డుమిని, మిల్లర్, మోరిస్, పార్నెల్‌/ ఫెలుక్‌వాయో, రబడ, మోర్కెల్, తాహిర్‌
పిచ్, వాతావరణం
భారత్, శ్రీలంక ఆడిన పిచ్‌నే ఈ మ్యాచ్‌కూ ఉపయోగిస్తున్నారు. బ్యాటింగ్‌కు అనుకూలమైన ఈ వికెట్‌పై టోర్నీలో ఇప్పటికే భారీ స్కోర్లు నమోదయ్యాయి. మ్యాచ్‌ రోజు వర్షం ప్రమాదం లేదు.

ఎర్ర బంతితో ప్రాక్టీస్‌...
శ్రీలంకతో మ్యాచ్‌లో స్వింగ్‌ బంతిని ఎదుర్కోవడంలో కోహ్లి విఫలమయ్యాడు. దీనిని పరిష్కరించుకునేందుకు కోహ్లి శనివారం ప్రత్యేకంగా టెస్టుల్లో వాడే ఎరుపు రంగు డ్యూక్‌ బంతితో సాధన చేశాడు. ఇంగ్లండ్‌ వాతావరణ పరిస్థితుల్లో ఎర్ర బంతి చాలా ఎక్కువగా స్వింగ్‌ అవుతుంది. దానిని సమర్థంగా ఎదుర్కోగలిగితే వన్డేల్లో తెలుపు బంతి స్వింగ్‌ను ఆడటం సులువవుతుందనే కోహ్లి ఈ ప్రయత్నం చేశాడు.  మరోవైపు కాకతాళీయం కావచ్చు కానీ భారత జట్టు ప్రాక్టీస్‌ సాగినంత సేపు కోహ్లి, కోచ్‌ కుంబ్లే ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు.

8ఐసీసీ టోర్నీలలో దక్షిణాఫ్రికాతో తలపడిన 12 మ్యాచ్‌లలో భారత్‌ 8 సార్లు గెలిచి 4 సార్లు ఓడింది. గత 4 మ్యాచ్‌లలో భారత్‌దే పైచేయి కావడం విశేషం.

మధ్యాహ్నం గం. 3 నుంచి
స్టార్‌ స్పోర్ట్స్‌–1లో ప్రత్యక్ష ప్రసారం


టాగ్లు: India,South Africa,Virat Kohli,భారత్‌,దక్షిణాఫ్రికా,విరాట్‌ కోహ్లి

మరిన్ని వార్తలు


'అవుట్' కోసం పోటీ పడ్డారు!
చాంపియన్స్ ట్రోఫీలో భారత్ -దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...

'ఆ క్రికెటర్ ను ప్రతీ జట్టు కోరుకుంటుంది'
ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ పై ఆ జట్టు కెప్టెన్ ఇయాన్ ...

అశ్విన్ వచ్చేశాడు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఆదివారం ఇక్కడ దక్షిణాఫ్రికాతో జరుగుతున్న వన్డే మ్యాచ్ లో ...

ఆసీస్‌ కథ కంచికి
చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ...

కెప్టెన్ కోహ్లీకి గంగూలీ కీలక సూచన!
టీమిండియా తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో జట్టులోకి ఓ ఆటగాడిని తీసుకోవాలని కెప్టెన్.. ...

ఒక్క మ్యాచ్‌ గెలువకుండానే..
వన్డే వరల్డ్‌కప్‌ విజేత అయిన ఆస్ట్రేలియా చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి అవమానకరరీతిలో వైదొలిగింది. ...

ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు:కోహ్లి
దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్కు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ ...

అశ్విన్ ను ప్రయోగిస్తారా?
చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ ల్లో ...

ఆసీస్ నిలుస్తుందా?
చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్లు రద్దు ...

సూపర్‌ షకీబ్‌.. వహ్వా మహ్మూద్‌
శతకాలతో రెచ్చిపోయిన జోడి ...



ఈరోజు ....


  భారత్
X
  దక్షిణాఫ్రికా

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.