Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

అశ్విన్ ను ప్రయోగిస్తారా?

Sports | Updated: Jun 10, 2017 11:43 (IST)


లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భారత క్రికెట్ జట్టు ఆడిన రెండు మ్యాచ్ ల్లో  ప్రధాన స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ కు చోటు దక్కని సంగతి తెలిసిందే. ఇంగ్లండ్ లో ఫాస్ట్ పిచ్ ల నేపథ్యంలో స్పిన్నర్ అయిన అశ్విన్ ను పక్కను పెట్టాల్సి వచ్చింది.  అయితే ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్ కు అశ్విన్ కు చోటు దక్కే అవకాశాలు కనబడుతున్నాయి. దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ లో డీకాక్, డుమిని, డేవిడ్ మిల్లర్ ల వంటి ఎడమచేతి స్టార్ ఆటగాళ్లు ఉండటం చేత అశ్విన్ ను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎడమచేతి వాటం ఆటగాళ్లు ఆఫ్ బ్రేక్ బౌలింగ్ ను ఎదుర్కోవడం కష్టం కనుక అశ్విన్ ను ప్రయోగించే అవకాశాలు లేకపోలేదు.
 

రేపటి మ్యాచ్ లో అశ్విన్ కు చోటు దక్కుతుందని దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కోచ్ నీల్ మెకన్జీ సైతం అభిప్రాయపడ్డాడు. తమతో చావో రేవో మ్యాచ్ లో అశ్విన్ ఎంపిక  కూడా కీలకం కానుందని మెకన్జీ పేర్కొన్నాడు.ఈ మేరకు భారత జట్టు తుది జట్టులో మార్పులు జరిగే అవకాశాలున్నాయన్నాడు. మరొకవైపు శ్రీలంకతో ఓటమి భారత ఆటగాళ్ల మదిలో తీవ్రంగా ఉందన్నాడు. డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత్ పై  ఒత్తిడి నెలకొన్న తరుణంలో దాన్నిసద్వినియోగం చేసుకుంటామన్నాడు. అయితే ఒక్క మ్యాచ్ లో ఓటమితో భారత్ ను తక్కువగా అంచనా వేయడం లేదన్నాడు. కచ్చితంగా భారత్ తో రసవత్తర పోరు ఖాయమన్నాడు.


టాగ్లు: Ravichandran Ashwin,south africa,india,champions trophy 2017,రవి చంద్రన్ అశ్విన్,దక్షిణాఫ్రికా,భారత్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


ఆసీస్‌ కథ కంచికి
చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి ఆస్ట్రేలియా నిష్క్రమించింది. ...

‘సఫారీ’ దాటితేనే సెమీస్‌
భారత జట్టుకు ఇప్పటి వరకు విరాట్‌ కోహ్లి 22 వన్డేల్లో కెప్టెన్‌గా వ్యవహరించాడు. ...

కెప్టెన్ కోహ్లీకి గంగూలీ కీలక సూచన!
టీమిండియా తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో జట్టులోకి ఓ ఆటగాడిని తీసుకోవాలని కెప్టెన్.. ...

ఒక్క మ్యాచ్‌ గెలువకుండానే..
వన్డే వరల్డ్‌కప్‌ విజేత అయిన ఆస్ట్రేలియా చాంపియన్స్‌ ట్రోఫీ నుంచి అవమానకరరీతిలో వైదొలిగింది. ...

ఇప్పుడేమీ చెప్పదలుచుకోలేదు:కోహ్లి
దక్షిణాఫ్రికాతో జరిగే కీలక మ్యాచ్కు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు టీమిండియా కెప్టెన్ విరాట్ ...

ఆసీస్ నిలుస్తుందా?
చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్లు రద్దు ...

సూపర్‌ షకీబ్‌.. వహ్వా మహ్మూద్‌
శతకాలతో రెచ్చిపోయిన జోడి ...

మేమేమీ అజేయులం కాదు!
లంకతో ఓటమిపై కోహ్లి వ్యాఖ్య ...

భారత్‌ను ఓడించేందుకు.. మాజీల వ్యూహాలు
పియన్స్‌ ట్రోఫీలో కామెంటేటర్లుగా అవతారమెత్తిన మాజీ క్రికెటర్లు తమ జట్టు విజయాలకు వ్యూహాలు ...

అశ్విన్‌ లోటు కనబడలేదు
చాంపియన్‌ ట్రోఫిలో భారత్‌ ఆడిన రెండు మ్యాచుల్లో అశ్విన్‌ తుది జట్టులో లేకపోయినా.. ...



ఈరోజు ....


  భారత్
X
  దక్షిణాఫ్రికా

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.