Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

సూపర్‌ షకీబ్‌.. వహ్వా మహ్మూద్‌

Sports | Updated: Jun 09, 2017 19:26 (IST)


శతకాలతో రెచ్చిపోయిన జోడి
కీలక మ్యాచ్‌లో బంగ్లా విజయం
న్యూజిలాండ్‌ అవుట్‌
చాంపియన్స్‌ ట్రోఫీ  


కార్డిఫ్‌: బంగ్లాదేశ్‌ ముందు 266 పరుగుల లక్ష్యం... చాంపియన్స్‌ ట్రోఫీలో నిలవాలంటే కచ్చితంగా నెగ్గాల్సిన మ్యాచ్‌.. కానీ 33 పరుగులకే నాలుగు వికెట్లు ఫట్‌.. కనీసం 150 పరుగులు చేస్తే గొప్పేమో అనే అనుకున్నారంతా.. అయితే షకీబ్‌ అల్‌ హసన్‌ (115 బంతుల్లో 114; 11 ఫోర్లు, 1 సిక్స్‌), మహ్ముదుల్లా (107 బంతుల్లో 102 నాటౌట్‌; 8 ఫోర్లు, 2 సిక్సర్లు) మాత్రం అంత సులువుగా లొంగలేదు. ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా వీరిద్దరి కళాత్మక ఆటతీరు అద్భుతం.. అపూర్వం.. ఈ క్రమంలో ఇరువురూ శతకాలతో రెచ్చిపోగా అటు ‘కొండంత’ లక్ష్యం సులువుగా కరిగిపోయింది. ఫలితంగా బంగ్లా 5 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసింది. 34.5 ఓవర్లు క్రీజులో నిలిచిన ఈ జోడి తమ ఆటతో బంగ్లా వన్డే చరిత్రలోనే ఏ వికెట్‌కైనా అత్యధిక పరుగుల (224) భాగస్వామ్యాన్ని నెలకొల్పింది.

నేడు (శనివారం) ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌లో ఆస్టేలియా ఓడితే బంగ్లాదేశ్‌ సెమీస్‌కు వెళుతుంది. ఇక ఈ ఓటమితో కివీస్‌ ఇంటిముఖం పట్టింది. అంతకుముందు శుక్రవారం వర్షం కారణంగా గంటపాటు ఆలస్యంగా ప్రారంభమైన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ 50 ఓవర్లలో 8 వికెట్లకు 265 పరుగులు చేసింది. టేలర్‌ (82 బంతుల్లో 63; 6 ఫోర్లు), విలియమ్సన్‌ (69 బంతుల్లో 57; 5 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. మొసద్దిక్‌ హŸస్సేన్‌కు మూడు, తస్కీన్‌ అహ్మద్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన బంగ్లాదేశ్‌ 47.2 ఓవర్లలో 5 వికెట్లకు 268 పరుగులు చేసి నెగ్గింది. సౌతీకి మూడు వికెట్లు దక్కాయి. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా షకీబ్‌ నిలిచాడు.

అహో.. షకీబ్, మహ్ముదుల్లా
కివీస్‌ను తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందం బంగ్లాకు ప్రారంభంలోనే ఆవిరైంది. పేసర్‌ సౌతీ ధాటికి జట్టు 12 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ముందుగా అత్యంత నిలకడగా ఆడుతున్న స్టార్‌ ఓపెనర్‌ తమీమ్‌ ఇక్బాల్‌ను తొలి ఓవర్‌ రెండో బంతికే ఎల్బీ చేసి షాక్‌ ఇచ్చాడు. ఆ తర్వాత తన వరుస ఓవర్లలో షబ్బీర్‌ (8), సౌమ్య సర్కార్‌ (3)లను కూడా పెవిలియన్‌కు చేర్చి కివీస్‌ శిబిరంలో సంతోషం నింపాడు. 12వ ఓవర్‌లో ముష్ఫిఖర్‌ (14) అవుట్‌ కావడంతో 33 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ దశలో జట్టును షకీబ్, మహ్ముదుల్లా అద్భుతంగా ఆదుకున్నారు. ఆరంభంలో పరిస్థితిని గమనించిన వీరిద్దరు మంచి పరిణతితో కూడిన ఆటను ప్రదర్శించి అబ్బురపరిచారు. వీరి ఇన్నింగ్స్‌లో ఒక్కసారి కూడా అవుటయ్యే ప్రమాదం లేకుండా స్కోరును పెంచుకుంటూ వెళ్లారు. ముందుగా 111 బంతుల్లో ఓ సిక్స్‌తో షకీబ్‌ సెంచరీ సాధించినా విజయానికి మరో తొమ్మిది పరుగుల దూరంలో అతడి సుదీర్ఘ ఇన్నింగ్స్‌ ముగిసింది. వెంటనే మహ్ముదుల్లా కూడా 107 బంతుల్లో బౌండరీతో శతకాన్ని అందుకుని జట్టుకు సూపర్‌ ఫినిషింగ్‌ ఇచ్చాడు.

విలియమ్సన్, టేలర్‌ అండ
ఆరంభం నుంచే బంగ్లా బౌలర్లు మెరుగ్గా బౌలింగ్‌ చేశారు. ఐదో ఓవర్‌లో గప్టిల్‌ (35 బంతుల్లో 33; 4 ఫోర్లు, 1 సిక్స్‌) వరుసగా సిక్స్, ఫోర్‌ బాదినా ఎనిమిదో ఓవర్‌లో రోంచి (18 బంతుల్లో 16; 2 ఫోర్లు)ని టస్కిన్‌ అవుట్‌చేశాడు. ఆ తర్వాత గప్టిల్‌ 13వ ఓవర్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యత విలియమ్సన్, టేలర్‌ తీసుకున్నారు. ఎక్కువగా సింగిల్స్, డబుల్స్‌తో పరుగులు రాబట్టి చెత్త బంతులను ఫోర్లు బాదు తూ స్కోరు పెంచారు. 58 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన విలియమ్సన్‌.. చాంపియన్స్‌ ట్రోఫీలో వరుసగా నాలుగు సార్లు ఈ ఫీట్‌ సాధించిన ఆటగాడయ్యాడు. అయితే 30వ ఓవర్‌లో లేని పరుగుకోసం యత్నించి రనౌట్‌ అయ్యాడు. దీంతో మూడో వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత కొద్దిసేపటికి టేలర్‌ కూడా వెనుదిరగడం జట్టును ఇబ్బందిపెట్టింది.


టాగ్లు: Champions Trophy,New Zealand,Shakib Al Hasan,చాంపియన్స్‌ ట్రోఫీ,న్యూజిలాండ్‌,షకీబ్‌ అల్‌ హసన్‌

మరిన్ని వార్తలు


ఆసీస్ నిలుస్తుందా?
చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్లు రద్దు ...

మేమేమీ అజేయులం కాదు!
లంకతో ఓటమిపై కోహ్లి వ్యాఖ్య ...

భారత్‌ను ఓడించేందుకు.. మాజీల వ్యూహాలు
పియన్స్‌ ట్రోఫీలో కామెంటేటర్లుగా అవతారమెత్తిన మాజీ క్రికెటర్లు తమ జట్టు విజయాలకు వ్యూహాలు ...

అశ్విన్‌ లోటు కనబడలేదు
చాంపియన్‌ ట్రోఫిలో భారత్‌ ఆడిన రెండు మ్యాచుల్లో అశ్విన్‌ తుది జట్టులో లేకపోయినా.. ...

గంగూలీ.. నీ షర్ట్‌ తీయకు..
చాంపియన్స్‌ ట్రోఫీలో గురువారం భారత్‌-శ్రీలంక మ్యాచ్‌లో కామెంటేటర్స్‌ మధ్య ఓ సరదా.. ...

మిస్టర్ కోహ్లి.. పాక్ ను చూసి నేర్చుకో!
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్.. ...

గెలుస్తామనుకోలేదు: మాథ్యూస్‌
భారత్‌పై దూకుడుగా ఆడాలని తమ మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర చేసిన సూచనలే ...

ధోని 'సిక్సర్ల' రికార్డు!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సాధించాడు. ...

న్యూజిలాండ్ గెలిస్తేనే..!
చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ...

టీమిండియాపై రెచ్చిపోయిన కేఆర్‌కే
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  ఆస్ట్రేలియా

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
BAN 3 1 1 3 0.00
AUS 2 0 0 2 0.00
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.