Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

ఆసీస్ నిలుస్తుందా?

Sports | Updated: Jun 10, 2017 09:32 (IST)


బర్మింగ్ హోమ్: చాంపియన్స్ ట్రోఫీలో వర్షం కారణంగా ఆసీస్ ఆడిన రెండు మ్యాచ్ లు రద్దు  కావడంతో ఆ జట్టు చావోరేవో సవాల్ కు  సిద్ధమైంది. న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లతో జరిగిన మ్యాచ్ లు రద్దు కావడంతో ఆసీస్ ఖాతాలో ప్రస్తుతం రెండు పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఈ తరుణంలో గ్రూప్-ఎలో ఇంగ్లండ్ తో శనివారం జరిగే వన్డే మ్యాచ్ ఆసీస్ కు అత్యంత కీలకం. ఈ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే నేరుగా నాకౌట్ కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ ఓటమి  ఎదురైతే గ్రూప్ స్టేజ్ లోనే ఆసీస్ ఇంటి దారి పట్టక తప్పదు.


మరొకవైపు వరుస విజయాలతో ఇప్పటికే సెమీస్ కు చేరిన ఇంగ్లండ్ ను ఓడించడం ఆసీస్ కు కష్టంగానే కనిపిస్తోంది. అన్ని రంగాల్లో పటిష్టంగా ఉన్న ఇంగ్లండ్ మంచి జోరుమీద ఉంది. దాంతో పటిష్టమైన ఇంగ్లండ్ పై విజయం సాధించాలంటే ఆసీస్ పూర్తిస్థాయి ప్రదర్శన చేయాలి.  ఇదిలా ఉంచితే, ఈ మ్యాచ్ ఇంగ్లండ్ కు నామమాత్రపు మ్యాచ్ కావడం  ఆ జట్టు మరింత దూకుడుగా ఆడే అవకాశం ఉంది. ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాయి.  ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ తొలుత టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.

ఆస్ట్రేలియా తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), అరోన్ ఫించ్, డేవిడ్ వార్నర్, హెన్రిక్యూస్, ట్రావిస్ హెడ్, మ్యాక్స్ వెల్, మాథ్యూ వేడ్, మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, ఆడమ్ జంపా,హజల్ వుడ్

ఇంగ్లండ్ తుది జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్),జాసన్ రాయ్, హేల్స్, జో రూట్, బెన్ స్టోక్స్, జాస్ బట్లర్, మొయిన్ అలీ,  రషిద్, ప్లంకెట్, మార్క్  వుడ్, జాక్ బాల్


టాగ్లు: australia,england,champions trophy 2017,ఆస్ట్రేలియా,ఇంగ్లండ్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


సూపర్‌ షకీబ్‌.. వహ్వా మహ్మూద్‌
శతకాలతో రెచ్చిపోయిన జోడి ...

మేమేమీ అజేయులం కాదు!
లంకతో ఓటమిపై కోహ్లి వ్యాఖ్య ...

భారత్‌ను ఓడించేందుకు.. మాజీల వ్యూహాలు
పియన్స్‌ ట్రోఫీలో కామెంటేటర్లుగా అవతారమెత్తిన మాజీ క్రికెటర్లు తమ జట్టు విజయాలకు వ్యూహాలు ...

అశ్విన్‌ లోటు కనబడలేదు
చాంపియన్‌ ట్రోఫిలో భారత్‌ ఆడిన రెండు మ్యాచుల్లో అశ్విన్‌ తుది జట్టులో లేకపోయినా.. ...

గంగూలీ.. నీ షర్ట్‌ తీయకు..
చాంపియన్స్‌ ట్రోఫీలో గురువారం భారత్‌-శ్రీలంక మ్యాచ్‌లో కామెంటేటర్స్‌ మధ్య ఓ సరదా.. ...

మిస్టర్ కోహ్లి.. పాక్ ను చూసి నేర్చుకో!
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన భారత క్రికెట్.. ...

గెలుస్తామనుకోలేదు: మాథ్యూస్‌
భారత్‌పై దూకుడుగా ఆడాలని తమ మాజీ కెప్టెన్‌ కుమార సంగక్కర చేసిన సూచనలే ...

ధోని 'సిక్సర్ల' రికార్డు!
టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సరికొత్త రికార్డును సాధించాడు. ...

న్యూజిలాండ్ గెలిస్తేనే..!
చాంపియన్స్ ట్రోఫీలో న్యూజిలాండ్ జట్టు సంక్లిష్ట పరిస్థితిని ఎదుర్కొంటుంది. ...

టీమిండియాపై రెచ్చిపోయిన కేఆర్‌కే
వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచే బాలీవుడ్ నటుడు, విమర్శకుడు కమల్ రషీద్ ఖాన్ ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  ఆస్ట్రేలియా

Group A

P W L PTS NRR
ENG 2 2 0 4 1.06
BAN 3 1 1 3 0.00
AUS 2 0 0 2 0.00
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 2 1 1 2 +1.272
SA 2 1 1 2 +1.000
SL 2 1 1 2 -0.879
PAK 2 1 1 2 -1.544

© Copyright Sakshi 2017. All rights reserved.