Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

తమీమ్ శతక్కొట్టుడు..

Sports | Updated: Jun 01, 2017 12:25 (IST)


లండన్: చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇంగ్లండ్ తో జరుగుతున్నఆరంభపు వన్డేలో బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సెంచరీ సాధించాడు. 124 బంతుల్లో  11 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో శతకం నమోదు చేశాడు. ఆది నుంచి ఇంగ్లండ్ బౌలర్లకు పరీక్షగా నిలిచిన తమీమ్ శతకంతో మెరిశాడు.  అతనికి ముష్ఫికర్ రహీమ్ హాఫ్ సెంచరీతో చక్కటి సహకారం అందివ్వడంతో బంగ్లాదేశ్ 39.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 214 పరుగులు చేసింది.

టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ను తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్ లు ఆరంభించారు. అయితే బంగ్లాదేశ్ స్కోరు 56 పరుగుల వద్ద సౌమ్య సర్కార్(28) తొలి వికెట్ గా పెవిలియన్ చేరాడు. ఆపై ఇమ్రూల్ కైస్(19) కూడా నిరాశపరిచాడు. ఆ తరుణంలో ఇక్బాల్ కు జత కలిసిన రహీమ్ స్కోరు బోర్డును చక్కదిద్దాడు. వీరిద్దరూ ఆచితూచి బ్యాటింగ్ చేసి వంద పరుగులకు పైగా భాగస్వామ్యాన్ని సాధించారు. ఆ క్రమంలోనే తమీమ్ ఇక్బాల్ సెంచరీ చేయగా, రహీమ్ హాఫ్ సెంచరీలతో మెరిశాడు.


టాగ్లు: tamim Iqbal,bangladesh,champions trophy 2017,తమీమ్ ఇక్బాల్,బంగ్లాదేశ్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


సెంచరీ చేజార్చుకున్న అలెక్స్‌
చాంపియన్‌ ట్రోఫిలో భాగంగా ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో 306 పరుగుల.. ...

శ్రీలంకకు ఎదురు దెబ్బ
చాంపియన్స్‌ ట్రోఫి బరిలోకి దిగుతున్న శ్రీలంక జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. ...

ఆసీస్ జెర్సీని ధరిస్తా: గంగూలీ
భారత క్రికెట్ జట్టు చరిత్రలో మాజీ సారథి సౌరవ్ గంగూలీది ప్రత్యేక స్థానం. ...

ఇంగ్లండ్‌పై చరిత్రను రిపీట్ చేస్తారా?
ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత బలంగా ఉన్న జట్టలో ఇంగ్లండ్ ఒకటి. ...

'ఎనిమిది' కోసం
విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా తన తొలి ఐసీసీ టోర్నీలో భారత్‌ను ఎలా నడిపిస్తాడు? ...

'కోహ్లికి ఇదొక మంచి ఛాన్స్'
ఉపఖండపు ఆటగాళ్లు ఇంగ్లండ్ పిచ్లపై పెద్దగా రాణించలేరనే వాదనతో భారత మాజీ కెప్టెన్ ...

'ప్రిన్స్ ఈజ్ బ్యాక్'
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ కు ... ...

బ్యాట్‌ ఇప్పుడు స్మార్ట్‌!
బ్యాట్లు కేవలం షాట్‌లు ఆడేందుకే పనికొస్తాయంటే తప్పులో కాలేసినట్లే! ...

బెంబేలెత్తించిన భారత పేస్‌
భారత జట్టు పేస్‌ బౌలింగ్‌ గురించి ఏ మాత్రం ఆందోళన చెందనవసరం ...

ఇక్కడ దూకుడుగా ఆడితే అంతే..!
చాంపియన్స్ ట్రోఫీ జరిగే ఇంగ్లండ్ లో దూకుడు పనికిరాదని అంటున్నాడు టీమిండియా ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 0 0 0 0 0.0
AUS 0 0 0 0 0.0
NZ 0 0 0 0 0.0
BAN 0 0 0 0 0.0

Group B

P W L PTS NRR
IND 0 0 0 0 0.0
PAK 0 0 0 0 0.0
SA 0 0 0 0 0.0
SL 0 0 0 0 0.0

© Copyright Sakshi 2017. All rights reserved.