Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

ఇక్కడ దూకుడుగా ఆడితే అంతే..!

Sports | Updated: May 30, 2017 06:08 (IST)


లండన్: చాంపియన్స్ ట్రోఫీ జరిగే ఇంగ్లండ్ లో దూకుడు పనికిరాదని అంటున్నాడు టీమిండియా బ్యాట్స్ మన్ కేదర్ జాదవ్. ఇక్కడ అవసరమైతే రంజీ, టెస్టు తరహాల్లో బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి కూడా ఉంటుందని జాదవ్ చెప్పుకొచ్చాడు. తొలి వార్మప్ మ్యాచ్ లో ఆడే అవకాశం రాకపోయినప్పటికీ జాదవ్ ఇంగ్లండ్ లోని పిచ్ పరిస్థితుల్ని పరిశోధించే పనిలో పడ్డాడు. ' న్యూజిలాండ్-భారత్ జట్ల మధ్య జరిగిన వార్మప్ మ్యాచ్ ల్లో ప్రతీ పరుగు కోసం ఆటగాళ్లు కష్టపడిన విషయాన్ని గమనించాను. పరిస్థితులు ఎప్పటికప్పుడు మారుతుండటంతో వారు నిలదొక్కుకునే ప్రయత్నం చేయలేకపోయారు.

'పిచ్ పై పచ్చిక బాగా ఉంది. దాంతో పాటు బంతి కూడా బాగా స్వింగ్ అయ్యింది. వచ్చే మ్యాచ్ ల్లో పరిస్థితి ఇలా ఉన్నా దూకుడుగా ఆడేందుకు యత్నించవచ్చు. కానీ టెక్నికల్ గా చూస్తే టెస్టు మ్యాచ్ ల్లోనూ, రంజీల్లోనూ బ్యాటింగ్ చేసినట్లు చేయాలి. మంచి బంతుల్ని కచ్చితంగా వదిలేయాలి. అంటే దూకుడుకు వెళితే అవుటయ్యే ప్రమాదమే ఎక్కువ'అని కేదర్ జాదవ్ అభిప్రాయపడ్డాడు.

నిజానికి కేదర్ జాదవ్ దూకుడుగా ఆడే ఆటగాడే. అయితే ఇంగ్లండ్ లో ఒళ్లు దగ్గర పెట్టుకుని ఆడితేనే ఆశించిన ఫలితాలుంటాయని పేర్కొన్న జాదవ్.. చాంపియన్స్ ట్రోఫీలో ఆడటం చాలా సంతోషంగా ఉందన్నాడు. ఇది తన తొలి చాంపియన్స్ ట్రోఫీ అని, సాధ్యమైనంత వరకూ జట్టు ప్రణాళికలు తగట్టు ఆడతానని తెలిపాడు. ఇందుకోసం నెట్స్ లో తీవ్రంగా శ్రమిస్తున్నట్లు జాదవ్ తెలిపాడు.


టాగ్లు: Kedar Jadhav,champions trophy 2017,india,కేదర్ జాదవ్,చాంపియన్స్ ట్రోఫీ 2017,భారత్

మరిన్ని వార్తలు


ఇంగ్లండ్‌పై చరిత్రను రిపీట్ చేస్తారా?
ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత బలంగా ఉన్న జట్టలో ఇంగ్లండ్ ఒకటి. ...

'ఎనిమిది' కోసం
విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా తన తొలి ఐసీసీ టోర్నీలో భారత్‌ను ఎలా నడిపిస్తాడు? ...

'కోహ్లికి ఇదొక మంచి ఛాన్స్'
ఉపఖండపు ఆటగాళ్లు ఇంగ్లండ్ పిచ్లపై పెద్దగా రాణించలేరనే వాదనతో భారత మాజీ కెప్టెన్ ...

'ప్రిన్స్ ఈజ్ బ్యాక్'
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ కు ... ...

బ్యాట్‌ ఇప్పుడు స్మార్ట్‌!
బ్యాట్లు కేవలం షాట్‌లు ఆడేందుకే పనికొస్తాయంటే తప్పులో కాలేసినట్లే! ...

బెంబేలెత్తించిన భారత పేస్‌
భారత జట్టు పేస్‌ బౌలింగ్‌ గురించి ఏ మాత్రం ఆందోళన చెందనవసరం ...

వీరి ఆట ఎంతవరకు?
చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లలో బలాబలాల పరంగా చూస్తే ఐదు టీమ్‌లకు ...

మూడో టైటిల్‌ లక్ష్యంగా...
నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ జరిగినప్పుడు ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌ కూడా ...

ప్రయోగాలకు ఆఖరి అవకాశం
చాంపియన్స్‌ ట్రోఫీ అసలు సమరానికి ముందు భారత జట్టు తమ చివరి మ్యాచ్‌ ...

కార్తీక్‌కు బంపర్‌ చాన్స్‌!
చాంపియన్స్‌ ట్రోఫీ రెండో వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై స్టైలిష్‌గా 94 పరుగులు చేసిన ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 0 0 0 0 0.0
AUS 0 0 0 0 0.0
NZ 0 0 0 0 0.0
BAN 0 0 0 0 0.0

Group B

P W L PTS NRR
IND 0 0 0 0 0.0
PAK 0 0 0 0 0.0
SA 0 0 0 0 0.0
SL 0 0 0 0 0.0

© Copyright Sakshi 2017. All rights reserved.