Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

బ్యాట్‌ ఇప్పుడు స్మార్ట్‌!

Sports | Updated: May 30, 2017 18:57 (IST)


చాంపియన్స్‌ ట్రోఫీలో సరికొత్త టెక్నాలజీ
లండన్‌: బ్యాట్లు కేవలం షాట్‌లు ఆడేందుకే పనికొస్తాయంటే తప్పులో కాలేసినట్లే! ఇప్పుడు స్మార్ట్‌గానూ అక్కరకొస్తాయి. ఇందుకోసం కొత్తగా చిప్‌లను బ్యాట్‌ హ్యాండిల్‌కు అమరుస్తున్నారు. దీంతో బ్యాట్‌ కదలికలు, షాట్ల లోతైన విశ్లేషణకు ఈ చిప్‌ సెట్లు దారి చూపించనున్నాయి. ఐసీసీతో జతకట్టిన ఇంటెల్‌ సంస్థ కొత్త టెక్నాలజీని ప్రవేశ పెట్టేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో బరిలోకి దిగే బ్యాట్స్‌మెన్‌ బ్యాట్‌కు చిప్‌ను అమరుస్తారు. ప్రతి జట్టులో ప్రయోగాత్మకంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ ‘చిప్‌’బ్యాట్లతో ఆడతారు. దీనివల్ల బ్యాట్‌ కదలికలన్నీ సునిశితంగా పసిగట్టవచ్చు.

అంతేకాదు... బ్యాట్స్‌మెన్‌ శైలిని అభిమానులకు మరింత చేరువ చేయడం ద్వారా సరికొత్త అనుభూతిని పొందవచ్చు. అంటే ఇప్పటిదాకా కేవలం రిప్లేలే చూసిన ప్రేక్షకులు లోతైన విశ్లేషణలు చూడొచ్చన్నమాట. కోచ్‌ల పని సులువవుతుంది. షాట్‌ సెలక్షన్‌లో స్పష్టంగా ఎక్కడ తప్పుజరిగిందో తెలుసుకోవచ్చు తద్వారా బ్యాట్స్‌మెన్‌ ప్రదర్శనను మెరుగుపర్చుకోవచ్చు. ఇందుకోసం మ్యాచ్‌ వేదికల్లో టెక్నాలజీ వినియోగాన్ని పెంచారు. స్పైడర్‌క్యామ్‌తో పాటు హాక్‌ ఐ కెమెరా, డ్రోన్‌ కెమెరాలతో ఈ చిప్‌ పనితీరు అనుసంధానించిన నెట్‌వర్క్‌కు చేరుతుంది. ఈ చిప్‌లతో బ్యాట్‌ స్పీడ్, బ్యాక్‌లిఫ్ట్‌ యాంగిల్, టైమ్‌ టు ఇంపాక్ట్‌లను  తెలుసుకోవచ్చు. భారత్‌ తరఫున రోహిత్‌ శర్మ, రహానే, అశ్విన్‌ల బ్యాట్లకు ఈ చిప్‌లను అమరుస్తారు.


టాగ్లు: Bats,Champions Trophy,Technology,బ్యాట్లు,చాంపియన్స్‌ ట్రోఫీ,టెక్నాలజీ

మరిన్ని వార్తలు


తమీమ్ శతక్కొట్టుడు..
బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సెంచరీ సాధించాడు. ...

ఆసీస్ జెర్సీని ధరిస్తా: గంగూలీ
భారత క్రికెట్ జట్టు చరిత్రలో మాజీ సారథి సౌరవ్ గంగూలీది ప్రత్యేక స్థానం. ...

ఇంగ్లండ్‌పై చరిత్రను రిపీట్ చేస్తారా?
ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత బలంగా ఉన్న జట్టలో ఇంగ్లండ్ ఒకటి. ...

'ఎనిమిది' కోసం
విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా తన తొలి ఐసీసీ టోర్నీలో భారత్‌ను ఎలా నడిపిస్తాడు? ...

'కోహ్లికి ఇదొక మంచి ఛాన్స్'
ఉపఖండపు ఆటగాళ్లు ఇంగ్లండ్ పిచ్లపై పెద్దగా రాణించలేరనే వాదనతో భారత మాజీ కెప్టెన్ ...

'ప్రిన్స్ ఈజ్ బ్యాక్'
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ కు ... ...

బెంబేలెత్తించిన భారత పేస్‌
భారత జట్టు పేస్‌ బౌలింగ్‌ గురించి ఏ మాత్రం ఆందోళన చెందనవసరం ...

ఇక్కడ దూకుడుగా ఆడితే అంతే..!
చాంపియన్స్ ట్రోఫీ జరిగే ఇంగ్లండ్ లో దూకుడు పనికిరాదని అంటున్నాడు టీమిండియా ...

వీరి ఆట ఎంతవరకు?
చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లలో బలాబలాల పరంగా చూస్తే ఐదు టీమ్‌లకు ...

మూడో టైటిల్‌ లక్ష్యంగా...
నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ జరిగినప్పుడు ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌ కూడా ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 0 0 0 0 0.0
AUS 0 0 0 0 0.0
NZ 0 0 0 0 0.0
BAN 0 0 0 0 0.0

Group B

P W L PTS NRR
IND 0 0 0 0 0.0
PAK 0 0 0 0 0.0
SA 0 0 0 0 0.0
SL 0 0 0 0 0.0

© Copyright Sakshi 2017. All rights reserved.