Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

ఆసీస్ జెర్సీని ధరిస్తా: గంగూలీ

Sports | Updated: Jun 01, 2017 11:23 (IST)


లండన్: భారత క్రికెట్ జట్టు చరిత్రలో మాజీ సారథి సౌరవ్ గంగూలీది ప్రత్యేక స్థానం.  భారత క్రికెట్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించినంత కాలం దూకుడే అతని సూత్రం. అదే టీమిండియా క్రికెట్ ను ఉన్నతిస్థానంలో నిలబెట్టిందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే గంగూలీ క్రీడా కెరీర్ కు గుడ్ బై చాలా కాలం అయినప్పటికీ అతనిలో దూకుడు మాత్రం ఏ మాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. తాజాగా ఆస్ట్రేలియా దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ తో బెట్టకట్టడమే  ఇందుకు ఉదాహరణ.

అసలు ఏమి జరిగిందంటే.. చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా  'ఆజ్ తక్ క్రికెట్ సలామ్' కార్యక్రమంలో వ్యాఖ్యాతలుగా గంగూలీతో పాటు ఆస్ట్రేలియా మాజీ ఆటగాళ్లు వార్నర్, మైకేల్ క్లార్క్ లు పాల్గొన్నారు. దానిలో భాగంగా జూన్18 వ తేదీన జరిగే ఫైనల్ మ్యాచ్ లో రెండు పటిష్టమైన జట్టు ఆస్ట్రేలియా-భారత్ లు తలపడతాయంటూ క్లార్క్ తన అభిప్రాయాన్ని తెలిపాడు. అయితే దీంతో గంగూలీ విభేదించాడు. ఫైనల్ తలపడే జట్టు భారత్-ఇంగ్లండ్ లు అంటూ గంగూలీ జోస్యం చెప్పాడు. దాంతో కాసింత అసహనానికి లోనైన క్లార్.. ఇంగ్లండ్ జట్టులో మ్యాచ్ విన్నర్లు ఎవరున్నారంటూ గంగూలీని ప్రశ్నించాడు. ఇంగ్లండ్ జట్టులో జో రూట్, బట్లర్ వంటి స్టార్ ఆటగాళ్లు ఉన్నారని, ఆస్ట్రేలియా కంటే ఇంగ్లండ్ జట్టే అన్ని విభాగాల్లో ఉందంటూ గంగూలీ ఎటువంటి మొహం లేకుండా చెప్పేశాడు.

ఇది షేన్ వార్న్ కు ఎంతమాత్రం రుచించలేదు. గ్రూప్-ఎ మ్యాచ్ లో జూన్ 10 వ తేదీన ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ లు తలపడుతున్నాయి కదా. ఇక్కడ ఆసీస్ గెలుస్తుందనేది తన బెట్ అంటూ వార్న్ సవాల్ విసిరాడు.ఆ మ్యాచ్ లో ఆసీస్ గెలిస్తే గంగూలీ తమ జట్టు జెర్సీ ధరించాలంటూ వార్న్ ఛాలెంజ్ చేశాడు. దీనికి గంగూలీ ముందుకొచ్చాడు. ఆ మ్యాచ్ లో ఆసీస్ గెలిచిన పక్షంలో వారి జెర్సీని ధరిస్తానని ఆ సవాల్ ను స్వీకరించాడు. అదే సమయంలో అక్కడ ఇంగ్లండ్ గెలిస్తే తాను ఆ జట్టు జెర్సీని వార్నర్ ధరించాల్సి ఉంది. మరి చూద్దాం ఏ జట్టు జెర్సీని ఎవరు ధరిస్తారో చూడాలి.


టాగ్లు: Sourav Ganguly,india,champions trophy 2017,england,సౌరవ్ గంగూలీ,భారత్,చాంపియన్స్ ట్రోఫీ 2017,ఇంగ్లండ్

మరిన్ని వార్తలు


కివీస్ కు సవాల్!
ఆస్ట్రేలియాతో జరుగుతున్న వన్డేలో న్యూజిలాండ్కు కఠిన పరీక్ష ఎదురుకానుంది. ...

విరాట్ సేన బలం అదే..
ఆస్ట్రేలియా మాజీ పేస్‌ దిగ్గజం గ్లెన్‌ మెక్‌గ్రాత్‌ భారత బౌలర్లపై ప్రశంసలు ...

పాక్‌తో మ్యాచ్‌: ధోనీ బౌలింగ్‌ ప్రాక్టీస్‌!
ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా టీమిండియా బరిలోకి దిగుతోంది. ...

గెలుపు ‘రూట్‌’ వేశాడు
ఇటీవలి కాలంలో భీకర ఫామ్‌తో అదరగొడుతున్న ఇంగ్లండ్‌ జట్టు తమ స్థాయికి తగ్గట్టుగానే ...

సెంచరీ చేజార్చుకున్న అలెక్స్‌
చాంపియన్‌ ట్రోఫిలో భాగంగా ఇంగ్లండ్‌-బంగ్లాదేశ్‌ మ్యాచ్‌లో 306 పరుగుల.. ...

శ్రీలంకకు ఎదురు దెబ్బ
చాంపియన్స్‌ ట్రోఫి బరిలోకి దిగుతున్న శ్రీలంక జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ.. ...

తమీమ్ శతక్కొట్టుడు..
బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సెంచరీ సాధించాడు. ...

ఇంగ్లండ్‌పై చరిత్రను రిపీట్ చేస్తారా?
ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత బలంగా ఉన్న జట్టలో ఇంగ్లండ్ ఒకటి. ...

'ఎనిమిది' కోసం
విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా తన తొలి ఐసీసీ టోర్నీలో భారత్‌ను ఎలా నడిపిస్తాడు? ...

'కోహ్లికి ఇదొక మంచి ఛాన్స్'
ఉపఖండపు ఆటగాళ్లు ఇంగ్లండ్ పిచ్లపై పెద్దగా రాణించలేరనే వాదనతో భారత మాజీ కెప్టెన్ ...



ఈరోజు ....


  ఆస్ట్రేలియా
X
  న్యూజిలాండ్

Group A

P W L PTS NRR
ENG 1 1 0 2 0.40
AUS 0 0 0 0 0.0
NZ 0 0 0 0 0.0
BAN 1 0 1 0 -0.40

Group B

P W L PTS NRR
IND 0 0 0 0 0.0
PAK 0 0 0 0 0.0
SA 0 0 0 0 0.0
SL 0 0 0 0 0.0

© Copyright Sakshi 2017. All rights reserved.