Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

ఇంగ్లండ్‌పై చరిత్రను రిపీట్ చేస్తారా?

Sports | Updated: Jun 01, 2017 09:50 (IST)


లండన్: ప్రస్తుత చాంపియన్స్ ట్రోఫీలో అత్యంత బలంగా ఉన్న జట్టలో ఇంగ్లండ్ ఒకటి. దాంతో పాటు ఈ టోర్నీ స్వదేశంలో జరుగుతుండటం కూడా వారికి అదనపు ప్రయోజనమనే చెప్పాలి. ఇదిలాఉంచితే, బంగ్లాదేశ్ తో జరుగుతున్న ఆరంభపు మ్యాచ్ లో ఇంగ్లండ్ ను ఒక సెంటిమెంట్ బలంగా వేధిస్తోంది.  అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే టోర్నమెంట్లలో ఇంగ్లండ్ పై బంగ్లాదేశ్ మెరుగైన రికార్డు ఉండటమే ఇందుకు కారణం. చివరిసారి ఇరుజట్ల మధ్య జరిగిన ఐసీసీ టోర్నమెంట్లలో ఇంగ్లండ్ పై బంగ్లాదేశ్ నే విజయం వరించింది. 2011, 2015 వరల్డ్ కప్ లలో ఇంగ్లండ్ పై బంగ్లాదేశ్ విజయం సాధించి సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ గత చరిత్రను పునరావృతం చేస్తుందా?అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ మ్యాచ్ లో ఇంగ్లండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన  ఇంగ్లండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ తొలుత బంగ్లాదేశ్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. గ్రూప్-ఎలో జరుగుతున్న మ్యాచ్ లో శుభారంభం చేయాలని ఇంగ్లండ్ భావిస్తుండగా, సంచలనాలకు మారుపేరైన బంగ్లాదేశ్ కూడా విజయంపై ధీమా వ్యక్తం చేస్తోంది.

బంగ్లాదేశ్ తుది జట్టు: మష్రాఫ్ మొర్తజా(కెప్టెన్), తమీమ్ ఇక్బాల్, సౌమ్య సర్కార్, ఇమ్రూల్ కైస్, షకిబుల్ హసన్, ముష్ఫికర్ రహీమ్, షబ్బీర్ రెహ్మాన్, మొహ్ముదుల్లా, మొసదాక్ హుస్సేన్, ముస్తాఫిజుర్ రహ్మాన్, రూబెల్ హుస్సేన్

ఇంగ్లండ్ తుది జట్టు: ఇయాన్ మోర్గాన్(కెప్టెన్), బెన్ స్టోక్స్, హేల్స్, జాసన్ రాయ్, జో రూట్, జాస్ బట్లర్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, ప్లంకెట్,  మార్క్ వుడ్, జాక్ బాల్


టాగ్లు: england,bangladesh,champions trophy 2017,ఇంగ్లండ్,బంగ్లాదేశ్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


తమీమ్ శతక్కొట్టుడు..
బంగ్లాదేశ్ ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ సెంచరీ సాధించాడు. ...

ఆసీస్ జెర్సీని ధరిస్తా: గంగూలీ
భారత క్రికెట్ జట్టు చరిత్రలో మాజీ సారథి సౌరవ్ గంగూలీది ప్రత్యేక స్థానం. ...

'ఎనిమిది' కోసం
విరాట్‌ కోహ్లి కెప్టెన్‌గా తన తొలి ఐసీసీ టోర్నీలో భారత్‌ను ఎలా నడిపిస్తాడు? ...

'కోహ్లికి ఇదొక మంచి ఛాన్స్'
ఉపఖండపు ఆటగాళ్లు ఇంగ్లండ్ పిచ్లపై పెద్దగా రాణించలేరనే వాదనతో భారత మాజీ కెప్టెన్ ...

'ప్రిన్స్ ఈజ్ బ్యాక్'
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్ తో జరిగిన వార్మప్ మ్యాచ్ కు ... ...

బ్యాట్‌ ఇప్పుడు స్మార్ట్‌!
బ్యాట్లు కేవలం షాట్‌లు ఆడేందుకే పనికొస్తాయంటే తప్పులో కాలేసినట్లే! ...

బెంబేలెత్తించిన భారత పేస్‌
భారత జట్టు పేస్‌ బౌలింగ్‌ గురించి ఏ మాత్రం ఆందోళన చెందనవసరం ...

ఇక్కడ దూకుడుగా ఆడితే అంతే..!
చాంపియన్స్ ట్రోఫీ జరిగే ఇంగ్లండ్ లో దూకుడు పనికిరాదని అంటున్నాడు టీమిండియా ...

వీరి ఆట ఎంతవరకు?
చాంపియన్స్‌ ట్రోఫీలో పాల్గొంటున్న ఎనిమిది జట్లలో బలాబలాల పరంగా చూస్తే ఐదు టీమ్‌లకు ...

మూడో టైటిల్‌ లక్ష్యంగా...
నాలుగేళ్ల క్రితం ఇంగ్లండ్‌లో చాంపియన్స్‌ ట్రోఫీ జరిగినప్పుడు ఆస్ట్రేలియా ఒక్క మ్యాచ్‌ కూడా ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 0 0 0 0 0.0
AUS 0 0 0 0 0.0
NZ 0 0 0 0 0.0
BAN 0 0 0 0 0.0

Group B

P W L PTS NRR
IND 0 0 0 0 0.0
PAK 0 0 0 0 0.0
SA 0 0 0 0 0.0
SL 0 0 0 0 0.0

© Copyright Sakshi 2017. All rights reserved.