Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

కోహ్లి ఫిదా.. కార్తీక్‌కు బంపర్‌ చాన్స్‌!

Top News | Updated: May 31, 2017 05:05 (IST)


లండన్‌: చాంపియన్స్‌ ట్రోఫీ రెండో వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై స్టైలిష్‌గా 94 పరుగులు చేసిన దినేశ్‌ కార్తీక్‌కు అన్నీ కలిసి వస్తున్నాయి. అన్నీ కుదిరితే అతను జూన్‌ 4న జరగనున్న భారత్‌-పాకిస్థాన్‌ పోరులో ఆడే అవకాశం కనిపిస్తోంది. బంగ్లాపై అతని ఆటతీరుతో ఫుల్‌ ఫిదా అయిన కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఈమేరకు బలమైన సంకేతాలు ఇచ్చాడు. అందరు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్న భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ కోసం తుదిజట్టులోకి దినేశ్‌ కార్తిక్‌ను తీసుకునే అవకాశముందని చెప్పాడు.

చాంపియన్స్‌ ట్రోఫీని నిలబెట్టుకోవాలని డిఫెండింగ్‌ చాంపియన్‌ అయిన టీమిండియా కృతనిశ్చయంతో ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రోఫీ సన్నాహకాల్లో భాగంగా జరిగిన రెండు వార్మప్‌ మ్యాచుల్లోనూ విజయం సాధించడంతో టీమిండియా ధీమాగా ఉంది.

‘ఆడిన రెండు మ్యాచుల్లోనే మేం కోరుకున్నది సాధించాం. బ్యాట్స్‌మెన్‌ పరుగులు రాబట్టారు. బౌలర్లు కూడా అద్భుతంగా ఆడారు. ఆకాశంలో మేఘాలు కమ్మినప్పుడు పరుగులు రాబట్టడం అంత సులభం కాదు’  అని కోహ్లి అన్నాడు. రెండో వార్మప్‌ మ్యాచ్‌లో బంగ్లాపై 240 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించడంపై కోహ్లి ఆనందం వ్యక్తం చేశాడు. హార్ధిక్‌ పాండ్యా, కేదార్‌ జాదవ్‌ లోయర్‌ ఆర్డర్‌లో బాగా ఆడుతున్నారు. దినేష్‌ కార్తీక్‌ అద్భుతమైన ఆటగాడు. అతనికి మరిన్ని అవకాశాలు ఇవ్వాలనుకుంటున్నాం. ఈ మ్యాచ్‌లలో మేం అన్నీ అవకాశాలు వినియోగించుకున్నామని కోహ్లి చెప్పాడు.
 


టాగ్లు: champions trophy 2017,dinesh karthik,virat kohli,చాంపియన్స్‌ ట్రోఫీ 2017,దినేశ్‌ కార్తీక్‌,విరాట్‌ కోహ్లి

మరిన్ని వార్తలు


'ఆ సత్తా విరాట్ సేనకు ఉంది'
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగిన టీమిండియాకు.. ...

అచ్చం ధోనీలా హెలికాఫ్టర్ షాట్!
చాంపియన్స్‌ ట్రోఫీలో ఆడిన రెండు వార్మప్ మ్యాచ్‌ల్లో టీమిండియా సత్తాచాటింది. ...

ఎవరి గోతిని వారే తీసుకున్నట్లే: మైక్ హస్సీ
టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీని తక్కువ అంచనా వేయోద్దంటూ ఆస్ట్రేలియా మాజీ ఆటగాడు ...

భారత జట్టు బలం వారే!
డిఫెండింగ్‌ చాంపియన్స్‌గా మినీ వరల్డ్‌ కప్‌ ( ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి) బరిలోకి ...

'చాంపియన్స్ ' ప్రైజ్ మనీ భారీగా పెంపు
ఇంగ్లండ్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ ప్రైజ్‌మనీని అంతర్జాతీయ క్రికెట్‌ కౌన్సిల్‌ (ఐసీసీ) భారీగా ...

కోహ్లీ కుమ్ముడు గ్యారంటీ: సెహ్వాగ్
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఇటీవలి కాలంలో ఐపీఎల్ పదో సీజన్‌లో పెద్దగా ...

సత్తాచాటుతా: యువరాజ్‌
చాంపియన్స్‌ ట్రోఫీలో డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగనున్న భారత్‌.. కప్పును తిరిగి దక్కించుకోవడంలో ...

జట్టులోకి రోహిత్, షమీ
జూన్‌ 1 నుంచి ఇంగ్లండ్‌లో జరిగే ఈ మెగా టోర్నీలో ఎనిమిది దేశాలు ...

చాంపియన్‌ ట్రోఫీ భారత జట్టు ప్రకటన
ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీకి బీసీసీఐ సోమవారం భారత జట్టును ప్రకటించింది. విరాట్‌ ...

ఊపిరి పీల్చుకోండి... చాంపియన్‌ వస్తోంది
ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీలో టీమిండియా పాల్గొనబోతోంది. ఆదివారం జరిగిన బీసీసీఐ ప్రత్యేక ...



ఈరోజు ....


  ఇంగ్లాండ్
X
  బంగ్లాదేశ్

Group A

P W L PTS NRR
ENG 0 0 0 0 0.0
AUS 0 0 0 0 0.0
NZ 0 0 0 0 0.0
BAN 0 0 0 0 0.0

Group B

P W L PTS NRR
IND 0 0 0 0 0.0
PAK 0 0 0 0 0.0
SA 0 0 0 0 0.0
SL 0 0 0 0 0.0

© Copyright Sakshi 2017. All rights reserved.