Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

ఆ రెండు రనౌట్లు నా తప్పిదమే..

Sports | Updated: Jun 12, 2017 12:44 (IST)


లండన్:చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా పేలవ ప్రదర్శనతో చతికిలబడింది. భారత్ తో జరిగిన పోరులో కనీసం పోటీ ఇవ్వని సఫారీలు దారుణమైన ఓటమిని మూటగట్టుకున్నారు. దక్షిణాఫ్రికా పరాజయంలో మూడు రనౌట్లు కీలక పాత్ర పోషించాయనడంలో ఎటువంటి సందేహం లేదు. ఏబీ డివిలియర్స్, డేవిడ్ మిల్లర్, ఇమ్రాన్ తాహీర్ లు రనౌట్లకు పెవిలియన్ చేరారు. ఇందులో  భారత ఫీల్డర్లు మెరుపు ఫీల్డింగ్ కు డివిలియర్స్, మిల్లర్ లు బలి కావడం ఆ జట్టు ఘోర ఓటమిపై ప్రభావం చూపింది. అయితే డివిలియర్స్, మిల్లర్ల రనౌట్లకు తన తొందరపాటు నిర్ణయమే కారణమని అంటున్నాడు  డు ప్లెసిస్.

'డివిలియర్స్, మిల్లర్ ల రనౌట్లకు నా తప్పిదమే కారణం. ఆ ఇద్దరూ మా జట్టులో కీలక ఆటగాళ్లు. అనవసరపు పరుగు కోసం యత్నించి రెండు కీలక రనౌట్లకు కారణమయ్యా. నా అనాలోచిత చర్యతో మేము భారీ మూల్యం చెల్లించుకున్నాం. ఆ ఇద్దరు మరి కొంత సేపు క్రీజ్ లో ఉండి ఉంటే పరిస్థితి మరొలా ఉండేది'అని డు ప్లెసిస్ ఆవేదన వ్యక్తం చేశాడు. దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 29 ఓవర్ లో జడేజా వేసిన బౌలింగ్ లో బంతిని పాయింట్ దిశగా మరల్చిన డు ప్లెసిస్ పరుగు కోసం డివిలియర్స్ ను పిలిచాడు. అదే సమయంలో హార్దిక్ పాండ్యా బంతిని వేగంగా అందుకుని ధోనికి ఇవ్వడంతో డివిలియర్స్ రనౌట్ గా పెవిలియన్ బాట పట్టాడు. ఆపై డు ప్లెసిస్ సమన్వయ లోపానికి మిల్లర్ సైతం బలయ్యాడు.


టాగ్లు: du plesis,south africa,india,champions trophy 2017,డు ప్లెసిస్,దక్షిణాఫ్రికా,భారత్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


అందరి చూపులు అందుకోసమే
చాంపియన్స్ ట్రోఫీలో భారీ అంచనాలతో దిగిన జట్లు భారత్-ఇంగ్లండ్లు. ...

దయచేసి ఆ ముద్ర వేయొద్దు: బుమ్రా
ఇంగ్లండ్ గడ్డపై ఈ సారి చాంపియన్స్‌ ట్రోఫీలో బంతి అంతగా స్వింగ్ అవకున్నా ...

అనుష్కతో ఆ మాట చెప్పి ఏడ్చేశాను!
తన ప్రేయసి అనుష్క శర్మతో తాను షేర్ చేసుకున్న ఓ గుడ్ న్యూస్ ...

కోహ్లీకి, డివిలియర్స్‌కు తేడా అదే..
చాంపియన్స్‌ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో భారత గెలుపుకు బౌలర్ల .. ...

సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు!
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ...

భారత్‌ పై మాది చెత్త ప్రదర్శన..
చాంపియన్స్‌ట్రోఫీలో భారత్‌తో జరిగిన కీలకపోరులో దక్షిణాఫ్రికా చెత్త ప్రదర్శనపై ఆ జట్టు ...

పాకిస్తాన్ తొమ్మిదిసార్లు..
చాంపియన్స్ ట్రోఫీలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ...

ఇంగ్లండ్ జెర్సీ ధరిస్తాడా?
ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టడం ఆ దేశ మాజీ క్రికెటర్ ...

మ్యాచ్‌లో గొప్ప మలుపు అదే
తప్పక గెలువాల్సిన మ్యాచ్‌లో బలమైన దక్షిణాఫ్రికా జట్టును చిత్తు చేయడంపై టీమిండియా కెప్టెన్‌ ...

నాకో చాన్స్‌ ఇవ్వండి..
చావో-రేవో తేల్చుకోవాల్సిన కీలకమైన మ్యాచ్‌లో చెత్త ఆటతీరు ప్రదర్శించడంపై దక్షిణాఫ్రికా.. ...



Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.