Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

సచిన్ రికార్డును బద్దలు కొట్టిన ధావన్

Sports | Updated: Jun 12, 2017 11:13 (IST)


లండన్:టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) నిర్వహించే టోర్నీల్లో వెయ్యి పరుగుల్ని వేగవంతంగా సాధించిన బ్యాట్స్ మన్ గా ధావన్ గుర్తింపు సాధించాడు. తద్వారా ఇప్పటివరకూ భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ పేరిట ఉన్న ఈ రికార్డును ధావన్ బద్దలు కొట్టాడు. చాంపియన్స్ ట్రోఫీలో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డేలో ఈ ఫీట్ ను ధావన్ అందుకున్నాడు. దక్షిణాఫ్రికా బౌలర్ ఇమ్రాన్ తాహీర్ బౌలింగ్ లో ఫోర్ కొట్టి వెయ్యి పరుగుల మార్కును చేరుకున్నాడు.

 

దక్షిణాఫ్రికా విసిరిన 192 పరుగుల లక్ష్య ఛేదనలో ధావన్ 78 పరుగులు సాధించిన సంగతి తెలిసిందే. ఐసీసీ టోర్నీల్లో వేగవంతపు వెయ్యి పరుగుల్ని సాధించడానికి సచిన్ కు 18 ఇన్నింగ్స్ లు అవసరమైతే, ధావన్ కు 16 ఇన్నింగ్స్ లు మాత్రమే అవసరమయ్యాయి. ఈ టోర్నీలో పాకిస్తాన్ పై 68 పరుగుల సాధించిన ధాన్.. శ్రీలంకపై 125 పరుగులు చేశాడు. 2013లో జరిగిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో ధావన్ మ్యాన్ ఆఫ్ ద సిరీస్ అవార్డును గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ టోర్నీలో ధావన్ 363 పరుగులతో అత్యధిక పరుగుల్ని నమోదు చేశాడు.


టాగ్లు: Shikhar Dhawan,ICC,sachin tendulkar,శిఖర్ ధావన్,ఐసీసీ,సచిన్ టెండూల్కర్

మరిన్ని వార్తలు


'టాప్'లేపిన కోహ్లి
అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ నంబర్ ...

వహ్వా... పాకిస్తాన్‌
237 పరుగుల స్వల్ప లక్ష్యం... బరిలోకి దిగిన పాకిస్తాన్‌ తన ‘సహజ’ ఆటను ...

అందరి చూపులు అందుకోసమే
చాంపియన్స్ ట్రోఫీలో భారీ అంచనాలతో దిగిన జట్లు భారత్-ఇంగ్లండ్లు. ...

దయచేసి ఆ ముద్ర వేయొద్దు: బుమ్రా
ఇంగ్లండ్ గడ్డపై ఈ సారి చాంపియన్స్‌ ట్రోఫీలో బంతి అంతగా స్వింగ్ అవకున్నా ...

అనుష్కతో ఆ మాట చెప్పి ఏడ్చేశాను!
తన ప్రేయసి అనుష్క శర్మతో తాను షేర్ చేసుకున్న ఓ గుడ్ న్యూస్ ...

కోహ్లీకి, డివిలియర్స్‌కు తేడా అదే..
చాంపియన్స్‌ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో భారత గెలుపుకు బౌలర్ల .. ...

ఆ రెండు రనౌట్లు నా తప్పిదమే..
చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారీ అంచనాల ...

భారత్‌ పై మాది చెత్త ప్రదర్శన..
చాంపియన్స్‌ట్రోఫీలో భారత్‌తో జరిగిన కీలకపోరులో దక్షిణాఫ్రికా చెత్త ప్రదర్శనపై ఆ జట్టు ...

పాకిస్తాన్ తొమ్మిదిసార్లు..
చాంపియన్స్ ట్రోఫీలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ...

ఇంగ్లండ్ జెర్సీ ధరిస్తాడా?
ఆస్ట్రేలియా గ్రూప్ స్టేజ్ లోనే ఇంటిదారి పట్టడం ఆ దేశ మాజీ క్రికెటర్ ...



Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.