Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

పసలేని టీమిండియా బౌలింగ్

Sports | Updated: Jun 18, 2017 11:24 (IST)


లండన్: చాంపియన్స్ ట్రోఫీ లో భాగంగా భారత్ తో జరుగుతున్న తుది పోరులో పాకిస్తాన్ భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. పాకిస్తాన్ ఓపెనర్లు అజహర్ అలీ, ఫకార్ జమాన్ లు హాఫ్ సెంచరీలు సాధించి శుభారంభాన్ని అందించారు. అజహర్ అలీ 61 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించగా, ఫకార్ జమాన్ 60 బంతుల్లో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు.

 

ఇన్నింగ్స్ ఆరంభంలో ఒక లైఫ్ తో బతికిబయట పడ్డ ఫకార్ మరొకసారి ఎటువంటి ఛాన్స్ ఇవ్వకుండా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అతనికి అజహర్ అలీ నుంచి చక్కటి సహకారం లభించింది. అయితే 23 ఓవర్ లో అజహర్ అలీ(59) రనౌట్ గా పెవిలియన్ చేరాడు. పాకిస్తాన్ 25.0 ఓవర్లు ముగిసే సరికి వికెట్ నష్టానికి 134 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన భారత్ జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. దాంతో బ్యాటింగ్ చేపట్టిన పాకిస్తాన్ ఆది నుంచి నిలకడగా బ్యాటింగ్ చేస్తూ ముందుకు సాగుతోంది. స్కోరు బోర్డుపై రన్ రేట్ కాపాడుకుంటూ నిలకడైన ఆటను ప్రదర్శిస్తోంది. భారత్ బౌలింగ్ లో పసలేకపోవడంతో పాకిస్తాన్ బ్యాట్స్ మన్లు ఎటువంటి తడబాటు లేకుండా పరుగులు రాబడుతున్నారు.


టాగ్లు: pakistan,india,champions trophy 2017,పాకిస్తాన్,భారత్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


మెయిడిన్ తో ఆరంభించారు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న ఫైనల్ పోరును భారత్ జట్టు ...

నో బాల్ వేశారు.. లైఫ్ ఇచ్చారు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న తుది పోరులో పాకిస్తాన్ ...

'చాంపియన్స్' ఎవరు?
చాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. ...

ఉత్కంఠ పోరు.. ఎవరిదో జోరు
దాయాదుల సమరం కోసం క్రికెట్‌ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ...

అంకెల్లో భారత్‌ విజయాలు
దాయాదుల పోరుకు సర్వం సిద్దమైంది. మరికొద్ది సేపట్లో మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ...

అతను మ్యాచ్‌ ఫినిషర్‌
చాంపియన్‌ ట్రోఫీలో వరుసగా విఫలమౌతున్న భారత్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌ ...

చక్ దే! ఇండియా
ఉరిమే ఉత్సాహంతో ఉన్న జట్టు ఓ వైపు... పడుతూ లేస్తూ ఫైనల్‌ చేరిన ...

'పాకిస్తాన్ పేసర్ల భయం అక్కర్లేదు'
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ బౌలింగ్ ను చూసి భారత జట్టు ఏమాత్రం ...

నా ఉద్దేశం అది కాదు: అమిర్ సొహైల్
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఫైనల్ కు చేరిందంటే అందుకు కారణం బయట శక్తుల ...

'భారత్ కు ముందు బ్యాటింగ్ ఇవ్వకండి'
చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ జట్లు ఫైనల్ కు చేరిన క్రమంలో తమ తమ ...



ఈరోజు ....


  భారత్
X
  పాకిస్తాన్

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.