Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

ఇండియా-పాక్‌ మ్యాచ్‌: అంకెల్లో భారత్‌ విజయాలు

Sports | Updated: Jun 18, 2017 08:34 (IST)


లండన్‌: దాయాదుల పోరుకు సర్వం సిద్దమైంది. మరికొద్ది సేపట్లో మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ప్రపంచ వ్యాప్తంగా భారత్‌-పాక్‌ మ్యాచ్‌ను 100 కోట్ల మంది చూస్తారని అంచనా. లండన్‌లో ఇప్పటికే రూ.2వేలకోట్ల బెట్టింగ్‌ జరిగింది. ఇంక భారత్‌లో లెక్కలేనంతగా కోట్లలలో బెట్టింగ్‌ జరుగుతోంది. రెండు ఉపఖండం జట్లు కప్పుకోసం పోటీ పడుతుండటంతో అభిమానులు రెచ్చిపోతున్నారు. భారత్‌ పాక్‌లు తొలిసారి ఐసీసీ వన్డే టోర్నీ ఫైనల్లో తలపడుతున్నాయి. దీంతో అభిమానుల్లో ఉత్కంఠత పెరుగుతోంది. ఇకపోతే అంకెల్లో భారత్‌ పాక్‌ల మ్యాచ్‌ల వివరాలు..

► దాదాపు పదేళ్లతర్వాత భారత్‌ పాక్‌లు ఐసీసీ టోర్నమెంట్‌లో రెండోసారి ఫైనల్లో తలపడుతున్నాయి. అంతకుముందు దక్షిణాఫ్రికాలో 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో తలపడ్డాయి. ఇందులో భారత్‌ ఐదుపరుగుల తేడాతో విజయం సాధించింది. 2015లో ప్రపంచకప్‌లో పాక్‌పై భారత్‌ విజయం సాధించింది. గత వరుస 10 మ్యాచ్‌ల్లో 6సార్లు భారత్‌ గెలిచింది.

► 1971 నుంచి ఇరు దేశాలు పలు దేశాల టోర్నమెంట్‌ సిరీస్‌ల్లో ఇప్పటికి 10 సార్లు ఫైనల్లో తలపడ్డాయి. ఇందులో పాక్‌పై భారత్‌కు మెరుగైన రికార్డు ఉంది.

►  తొమ్మిదేళ్ల తర్వాత వివిధ దేశాల టొర్నమెంటుల్లో తలపడుతున్నాయి. అంతకు ముందు 2008లో ఢాకాలో జరిగిన ముక్కోణపు సిరీస్‌లో భారత్‌పై పాక్‌ 25పరుగుల తేడాతో గెలుపొందింది

► ఇప్పటి వరకూ ఐసీసీ నిర్వహించిన మ్యాచ్‌ల్లో భారత్‌ పాక్‌లు 15 మ్యాచ్‌లు ఆడగా అందులో భారత్‌ 13 గెలిచింది. పాక్‌ మరో రెండింటిల్లో విజయం సాధించింది. అంతేకాకుండా చాంపియన్‌ట్రోఫీలో ఇరుదేశాలు చెరో రెండు సార్లు గెలిచాయి.

► ఇప్పటి వరకూ భారత్‌-పాక్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో 5గురు పాక్‌ బ్యాట్‌మెన్లు సెంచరీలు చేశారు. 2008లో జరిగిన మ్యాచ్‌లో సల్మాన్‌ భట్‌ అత్యధిక పరుగులు(129) చేశాడు. భారత్‌ తరపున కేవలం సౌరవ్‌ గంగూలీ(124) మాత్రమే సెంచరీ చేశాడు.

► భారత్‌-పాక్‌ ఫైనల్‌ మ్యాచ్‌ల్లో ఇద్దరు పాక్‌ బౌలర్లు 5వికెట్లు తీశారు. 1991లో అకిబ్‌ జావీద్‌(7/37), 1999లో అజార్‌ అహ్మద్‌(5/38) వికెట్లు తీశారు. 1994 షార్జాలో భారత్‌ తరపున రాజేష్‌ చౌవాన్‌(3/29) మెరుగైన ప్రదర్శన చేశాడు.


టాగ్లు: India,Pakistan,Champions Trophy,భారత్‌,పాకిస్తాన్‌,చాంపియన్స్‌ ట్రోఫీ

మరిన్ని వార్తలు


మెయిడిన్ తో ఆరంభించారు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న ఫైనల్ పోరును భారత్ జట్టు ...

నో బాల్ వేశారు.. లైఫ్ ఇచ్చారు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న తుది పోరులో పాకిస్తాన్ ...

'చాంపియన్స్' ఎవరు?
చాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. ...

ఉత్కంఠ పోరు.. ఎవరిదో జోరు
దాయాదుల సమరం కోసం క్రికెట్‌ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ...

అతను మ్యాచ్‌ ఫినిషర్‌
చాంపియన్‌ ట్రోఫీలో వరుసగా విఫలమౌతున్న భారత్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌ ...

చక్ దే! ఇండియా
ఉరిమే ఉత్సాహంతో ఉన్న జట్టు ఓ వైపు... పడుతూ లేస్తూ ఫైనల్‌ చేరిన ...

'పాకిస్తాన్ పేసర్ల భయం అక్కర్లేదు'
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ బౌలింగ్ ను చూసి భారత జట్టు ఏమాత్రం ...

నా ఉద్దేశం అది కాదు: అమిర్ సొహైల్
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఫైనల్ కు చేరిందంటే అందుకు కారణం బయట శక్తుల ...

'భారత్ కు ముందు బ్యాటింగ్ ఇవ్వకండి'
చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ జట్లు ఫైనల్ కు చేరిన క్రమంలో తమ తమ ...

ఫైనల్ మ్యాచ్ ఫలితంపై కోహ్లీ జోస్యం
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ చేరిన పాకిస్తాన్, భారత్‌లు పూర్తి స్థాయిలో కసరత్తులు ...



ఈరోజు ....


  భారత్
X
  పాకిస్తాన్

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.