Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

అతను మ్యాచ్‌ ఫినిషర్‌: కోహ్లీ

Sports | Updated: Jun 18, 2017 06:49 (IST)


లండన్‌: చాంపియన్‌ ట్రోఫీలో వరుసగా విఫలమౌతున్న భారత్‌ ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యాను కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ వెనుకేసుకొచ్చాడు. హార్ధిక్‌ అమూల్యమైన ఆటగాడని కితాబిచ్చాడు. ఎటువంటి సందర్భంలోనైనా మ్యాచ్‌ స్వరూపాన్ని మార్చగల సత్తా ఉన్నవాడని పొగిడాడు. పాండ్య అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాడు. అటు బంతితో ఇటు బ్యాట్‌తో రాణించగల సత్తా ఉన్నవాడు.

శ్రీలంకతో మ్యాచ్‌లో 5బంతుల్లో9 పరుగులు, పాకిస్తాన్‌ మ్యాచ్‌లో 6బంతుల్లో 20పరుగులు చేశాడు. అయితే బౌలింగ్‌లో మాత్రం నాలుగు మ్యాచ్‌ల్లో 3 వికెట్లు మాత్రమే తీశాడని కెప్టెన్‌ తెలిపాడు. టీంలో సీనియర్‌ ఆటగాళ్లు, ఉమేష్‌ యాదవ్‌, మహమ్మద్‌ సమీలను తీసుకోవాలని చాలా మంది ప్రశ్నించారని విరాట్‌ తెలిపాడు. తాను మాత్రం మొండిగా పాండ్యాకే ఓటు వేసినట్లు చెప్పాడు. పాండ్యాకు మరికొన్ని అవకాశాలు ఇవ్వాలని భావించినట్లు కోహ్లీ తెలిపాడు. కీలక సమయంలో మ్యాచ్‌ ఫినిషర్‌గా ఉపయోగపడుతున్నాడని పేర్కొన్నాడు.

లక్ష్య ఛేదన చేయాల్సి వచ్చినప్పుడు ఎనిమిదో స్థానం వరకూ బ్యాటింగ్‌ సామర్థ్యం ఉండాలన్నాడు. ఆ సమయంలో హార్ధిక్‌ జట్టును విజయతీరాలకు చేర్చగల సత్తా ఉన్నవాడు. ఫీల్డింగ్‌ విషయంలోను విశేషంగా రాణిస్తున్నాడని విరాట్‌ పొగిడాడు. చాంపియన్‌ ట్రోఫీలో తన ప్రదర్శన బాగానే ఉందన్నాడు, కీలక సమయంలో వికెట్లు తీసి రాణిస్తున్నాడంటూ వెనుకేసుకొచ్చాడు. చివరి యుద్ధంలో జట్టును మార్చే యోచన లేదని కోహ్లీ తెలిపాడు.


టాగ్లు: Hardik pandya,virat kohli,champion trophy,Ind vs pak final match,హార్దిక్‌ పాండ్యా,విరాట్‌ కోహ్లీ,చాంపియన్‌ ట్రోఫీ,భారత్‌- పాక్‌ ఫైనల్‌ మ్యాచ్‌

మరిన్ని వార్తలు


మెయిడిన్ తో ఆరంభించారు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న ఫైనల్ పోరును భారత్ జట్టు ...

నో బాల్ వేశారు.. లైఫ్ ఇచ్చారు..
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న తుది పోరులో పాకిస్తాన్ ...

'చాంపియన్స్' ఎవరు?
చాంపియన్స్ ట్రోఫీలో అసలు సిసలు పోరుకు రంగం సిద్ధమైంది. ...

ఉత్కంఠ పోరు.. ఎవరిదో జోరు
దాయాదుల సమరం కోసం క్రికెట్‌ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ...

అంకెల్లో భారత్‌ విజయాలు
దాయాదుల పోరుకు సర్వం సిద్దమైంది. మరికొద్ది సేపట్లో మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ...

చక్ దే! ఇండియా
ఉరిమే ఉత్సాహంతో ఉన్న జట్టు ఓ వైపు... పడుతూ లేస్తూ ఫైనల్‌ చేరిన ...

'పాకిస్తాన్ పేసర్ల భయం అక్కర్లేదు'
చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్తాన్ బౌలింగ్ ను చూసి భారత జట్టు ఏమాత్రం ...

నా ఉద్దేశం అది కాదు: అమిర్ సొహైల్
చాంపియన్స్ ట్రోఫీలో పాకిస్తాన్ ఫైనల్ కు చేరిందంటే అందుకు కారణం బయట శక్తుల ...

'భారత్ కు ముందు బ్యాటింగ్ ఇవ్వకండి'
చాంపియన్స్ ట్రోఫీలో భారత్-పాకిస్తాన్ జట్లు ఫైనల్ కు చేరిన క్రమంలో తమ తమ ...

ఫైనల్ మ్యాచ్ ఫలితంపై కోహ్లీ జోస్యం
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫైనల్ చేరిన పాకిస్తాన్, భారత్‌లు పూర్తి స్థాయిలో కసరత్తులు ...



ఈరోజు ....


  భారత్
X
  పాకిస్తాన్

Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.