Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

పాక్‌ ఫైనల్‌కు రావడంలో ఆశ్చర్యం లేదు

Sports | Updated: Jun 16, 2017 12:28 (IST)


బర్మింగ్‌హోమ్‌: చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు పాకిస్థాన్‌ రావడం తనకు ఆశ్చర్యం కలగించలేదని భారత్‌ పేస్‌ బౌలర్‌ జస్ప్రీత్‌ బుమ్రా తెలిపాడు. ఏ రోజు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించలేమని.. క్రికెట్‌లో ఏ జట్టును తక్కువ అంచనా వేయకూడదని అభిప్రాయపడ్డాడు. వెస్టిండీస్‌ పర్యటనకు ఎంపిక చేసిన జట్టులో చోటు లేకపోవడంపై బుమ్రా స్పందించాడు. 
 
వంద శాతం ఫిట్‌గా ఉన్నానని కానీ విశ్రాంతి అవసరమని సెలెక్టర్లు భావించడంతో వెస్టీండిస్‌ పర్యటనకు ఎంపిక చేయలేదని ఈ స్పీడ్‌స్టార్‌ పేర్కొన్నాడు. వెస్టిండీస్‌తో ఈ నెల 23 నుంచి జరిగే 5 వన్డేలు, ఏకైక టీ20 మ్యాచ్‌లకు ఓపెనర్‌ రోహిత్‌ శర్మ,  బుమ్రాకు విశ్రాంతినిచ్చిన విషయం తెలిసిందే. పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, కానీ సెలక్టర్లు, టీం మెనెజ్‌మెంట్‌ విశ్రాంతి తీసుకోవాలని సూచించారని బుమ్రా పేర్కొన్నాడు. తనకు ఎలాంటి ఫిట్‌నెస్‌ సమస్యలు లేవని స్పష్టం చేశాడు. ఎంపిక చేయకపోవడం పట్ల నిరాశచెందలేదని చెప్పుకొచ్చాడు.
 
ఇక బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీస్‌లో బుమ్రా రెండు వికెట్లు తీసి ఏకంగా 41 డాట్‌ బంతులు వేశాడు. డాట్‌ బంతుల వల్ల బ్యాట్స్‌మెన్‌ కు ఒత్తిడి పెరిగి ఇతర బౌలర్లకు వికెట్లు దక్కుతాయని బుమ్రా అభిప్రాయపడ్డాడు. యార్కర్లు వేయడం కష్టమని దీనికోసం నెట్స్‌లో తీవ్రంగా కృషి చేశానని బుమ్రా పేర్కొన్నాడు.  ఇక ఈ గుజరాతీ చాంపియన్స్‌ ట్రోఫీలో  రివర్స్‌ స్వింగ్‌ బంతులతో  డెత్‌ ఓవర్లలో అద్భుతంగా రాణించాడు.

టాగ్లు: Bumrah,Champions Trophy,West indies series,బుమ్రా,చాంపియన్స్‌ ట్రోఫీ,వెస్టిండీస్‌

మరిన్ని వార్తలు


మాట నిలబెట్టుకున్నాడు!
చాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టుపై పందెం కాసి ఓడిపోయిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ...

'చాంపియన్'లా వేటాడారు
కోటి ఆశలతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కోరికను నిర్దాక్షిణ్యంగా తుంచేస్తూ టీమిండియా ...

'పాక్ జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడింది'
చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జట్టుకు మాజీ క్రికెటర్ ఆమీర్ ...

పాక్ ఆటతీరు అమోఘం
తెలివైన గేమ్ ప్లాన్‌తో రంగంలోకి దిగడంతో బంగ్లాదేశ్‌పై అలవోకగా విజయం సాధించామని కెప్టెన్ ...

యువీ రికార్డుపై భజ్జీ ఏమన్నాడంటే..!
చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ ...

ఫైనల్లో విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన భారత జట్టు ఫైనల్లోకి ...

ధావన్ మరో రికార్డు..
బంగ్లాదేశ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో ధావన్ మరో రికార్డును నెలకొల్పాడు. ...

జహీర్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను ...

టీమిండియా లక్ష్యం 265
:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ ...

హార్దిక్ ఎంత పనిచేశాడు..!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ...



Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.