Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

ఫైనల్‌కు ముందు పాక్‌పై ఫిక్సింగ్ ఆరోపణలు

Sports | Updated: Jun 16, 2017 07:25 (IST)


ఇస్లామాబాద్: చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జట్టుకు మాజీ క్రికెటర్ ఆమీర్ సోహైల్ షాకిచ్చాడు. గతంలో సయీద్ అన్వర్‌తో భారీ ఓపెనింగ్ భాగస్వామ్యాలు అందించిన మాజీ కెప్టెన్.. రిటైర్మెంట్ అనంతరం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్‌గానూ వ్యవహరించిన ఈ క్రికెటర్ పాక్ జట్టుపై ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం చర్చనీయాంశమైంది. మరో రెండు రోజుల్లో భారత్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడనున్న పాకిస్తాన్ జట్టు మ్యాచ్‌లు ఫిక్సింగ్ కు పాల్పడి ఉండొచ్చునని సోహైల్ శుక్రవారం బాంబు లాంటి వార్త పేల్చాడు.

ఫిక్సర్ల సాయంతోనే ప్రత్యర్ధి జట్లకు భారీగా నగదు ముట్టజెప్పడంతోనే పాక్ విజయాలు సాధ్యమయ్యాయని పేర్కొన్నాడు. భారత్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడేలా ప్లాన్ చేసి ఇంగ్లండ్‌తో సెమీఫైనల్‌ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నెగ్గారన్న వాదనలు తెరపైకి తెచ్చాడు. పాకిస్తాన్‌లో ఓ న్యూస్ చానెల్‌తో మాట్లాడుతూ ఈ ఆరోపణలు చేసినట్లు తెలుస్తోంది. టోర్నీ ప్రైజ్ మనీ కంటే ఎక్కువ మొత్తంలో ముట్టజెప్పి ఇంగ్లండ్‌పై పాక్ విజయం సాధించిందని, పాక్ బడా వ్యాపారవేత్తల హస్తం ఉందని పాక్ మాజీ కెప్టెన్ అంటున్నాడు. పాక్‌ మైదానంలో ఆటతీరుతో కాకుండా జట్టుతో పాటు ప్రస్తుత కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్‌ ఫిక్సింగ్ ఉదంతానికి పాల్పడ్డాడని సోహైల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు.

సర్ఫరాజ్ ఈ మైదానంలో ఏ మాత్రం రాణించలేదని, ఫిక్సింగ్‌లో అతడి హస్తం కచ్చితంగా ఉండొచ్చునని సోహైల్ అనుమానాలు వ్యక్తం చేశాడు. ఉత్తమ ప్రదర్శణతో పాక్ ఫైనల్ చేరలేదని, ఇతరత్రా కారణాల వల్లే తుది మెట్టుకు చేరుకోగలిగిందని అభిప్రాయపడ్డాడు. ఫిక్సింగ్ ఆరోపణలపై పాక్ కెప్టెన్ సర్ఫరాజ్ సహా ఆటగాళ్లు ప్రస్తుతానికి స్పందించలేదు. అయితే వారి ఆటపై మాత్రం సోహైల్ ఆరోపణలు ఎంతో కొంత ప్రభావం చూపే అవకాశం ఉందని పాక్ మాజీ క్రికెటర్లు, అభిమానులు చెబుతున్నారు.


టాగ్లు: Champions Trophy,Aamer Sohail,India,Pakistan,చాంపియన్స్ ట్రోఫీ,ఆమీర్ సోహైల్,భారత్,పాకిస్తాన్

మరిన్ని వార్తలు


మాట నిలబెట్టుకున్నాడు!
చాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టుపై పందెం కాసి ఓడిపోయిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ...

'చాంపియన్'లా వేటాడారు
కోటి ఆశలతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కోరికను నిర్దాక్షిణ్యంగా తుంచేస్తూ టీమిండియా ...

పాక్ ఆటతీరు అమోఘం
తెలివైన గేమ్ ప్లాన్‌తో రంగంలోకి దిగడంతో బంగ్లాదేశ్‌పై అలవోకగా విజయం సాధించామని కెప్టెన్ ...

యువీ రికార్డుపై భజ్జీ ఏమన్నాడంటే..!
చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ ...

ఫైనల్లో విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన భారత జట్టు ఫైనల్లోకి ...

ధావన్ మరో రికార్డు..
బంగ్లాదేశ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో ధావన్ మరో రికార్డును నెలకొల్పాడు. ...

జహీర్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను ...

టీమిండియా లక్ష్యం 265
:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ ...

హార్దిక్ ఎంత పనిచేశాడు..!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ...

తొలి రెండు వికెట్లు భువీకే..
చాంపియన్స్ ట్రోఫీలో ఇక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ...



Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.