Registration to Participating in a Quiz Competition
గుడ్ మార్నింగ్..
ఇదొక్క అందమైన మార్నింగ్!
ఈ శుభోదయపు పలకరింపుతోనే సరిగ్గా పదిహేనేళ్ల క్రితం.. రంగుల హరివిల్లులా.. ‘సాక్షి’ దిన పత్రిక ఆవిర్భవించింది. ‘సత్యమేవ జయతే..’ అంటూ నికార్సైన జర్నలిజానికి శంఖం పూరించింది. నాటి నుంచీ అంచెలంచెలుగా ఎదుగుతూ విలువలకు కట్టుబడిన పాత్రికేయ ధర్మాన్ని నిబద్ధతతో కొనసాగిస్తూ వస్తోంది. ఈ మహాయజ్ఞం ఇప్పుడు పదహారవ యేటలోకి ప్రవేశిస్తున్న సందర్భంలో ‘సాక్షి’ తన పాఠకులకు చిన్న క్విజ్ పెట్టి, కానుకలను ఇవ్వదలచింది.