ప్రేమకు సంబంధించి మీ జీవితంలో ఎన్నో ఎన్నేన్నో తీపి జ్ఞాపకాలు ఉండొచ్చు. మధురమైన మరిచిపోలేని ఎన్నో సంఘటనలు మీ అనుభవంలో ఉండొచ్చు. ప్రేమను పొందడం, ప్రేమను అందించడం... చెప్పడానికి సులభంగా కనిపించినా అందులోని మాధుర్యం, తపన, ఆరాటం... అన్నీ కొలవలేని, మరిచిపోలేని మధుర జ్ఞాపకాలే. అలాంటి మధురమైన అనుభవాలను మాకు పంపండి. స్వచ్చమైన మీ ప్రేమను " సాక్షి" ద్వారా నలుగురికి తెలియజెప్పండి. పైన పేర్కొన్న వివరాలను మీ అనుభవాలను మాకు పంపండి.(ఒకరిని నొప్పించడానికి, ఇంకెవరినో కించపరచడానికి కాదు. నిస్వార్థ నిర్మలమైన ప్రేమ కోసమే ఈ పేజీ అని గమనించగలరు)