Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

'ఆ జట్లు సెమీస్‌కు వస్తాయని అనుకోలేదు'

Top News | Updated: Jun 13, 2017 12:49 (IST)


చాంపియన్స్‌ ట్రోఫీలో శ్రీలంకపై అనూహ్య విజయం సాధించిన పాకిస్థాన్‌ జట్టు సెమీస్‌కు చేరుకోవడంపై కుమార సంగక్కర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కీలకమైన ఈ మ్యాచ్‌లో లంక జట్టు పలు పొరపాట్లు చేసిందని ఆ జట్టు మాజీ ఆటగాడైన సంగక్కర అభిప్రాయపడ్డాడు. చాంపియన్స్‌ ట్రోఫీలో ఆసియాకు చెందిన నాలుగు జట్లు టాప్‌-4లో ఉన్నాయని, టోర్నమెంటుకు ముందు ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించి ఉండరని అన్నారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌ జట్లు సెమీఫైనల్‌కు చేరుతాయని తాను అనుకోలేదని, కానీ అద్భుతంగా ఆడి ఆ జట్లు ఈ ఘనత సాధించాయని, చక్కని క్రికెట్‌ ఆడి సెమీస్‌కు చేరిన ఘనత వాటికి దక్కుతుందని అన్నాడు.

చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా సోమవారం జరిగిన ఈ గ్రూప్‌ ‘బి’ మ్యాచ్‌లో పాక్‌ 3 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 49.2 ఓవర్లలో 236 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. ఓపెనర్‌ డిక్‌వెల్లా (86 బంతుల్లో 73; 4 ఫోర్లు), మ్యాథ్యూస్‌ (54 బంతుల్లో 39; 2 ఫోర్లు, 1 సిక్స్‌) మాత్రమే రాణించగలిగారు. పేసర్లు జునైద్‌ ఖాన్, హసన్‌ అలీలకు మూడేసి, ఆమిర్, అష్రాఫ్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పాక్‌ 44.5 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులు చేసింది. లక్ష్యఛేదన సందర్భంగా పాకిస్థాన్‌ ఓ దశలో స్కోరు 162/7తో వెనుకబడటంతో... ఇక శ్రీలంక గెలుపు ఖాయమే అని అంతా భావించారు. కానీ, కెప్టెన్‌ సర్ఫరాజ్‌ (79 బంతుల్లో 61 నాటౌట్‌; 5 ఫోర్లు), ఆమిర్‌ (43 బంతుల్లో 28 నాటౌట్‌; 1 ఫోర్‌) పట్టువదలని పోరాటం ఆ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించింది. పాక్‌ బ్యాట్స్‌మెన్‌ ఫఖర్‌ జమాన్‌ (36 బంతుల్లో 50; 8 ఫోర్లు, 1 సిక్స్‌), అజహర్‌ అలీ (50 బంతుల్లో 34; 2 ఫోర్లు, 1 సిక్స్‌) కూడా రాణించారు.


టాగ్లు: Kumar Sangakkara,pakistan,srilanka,champions trophy 2017,పాకిస్తాన్‌,శ్రీలంక,కుమార సంగక్కర,చాంపియన్స్‌ ట్రోఫి 2017

మరిన్ని వార్తలు


'టాప్'లేపిన కోహ్లి
అంతర్జాతీయ వన్డే ర్యాంకింగ్స్ లో భారత కెప్టెన్ విరాట్ కోహ్లి మళ్లీ నంబర్ ...

వహ్వా... పాకిస్తాన్‌
237 పరుగుల స్వల్ప లక్ష్యం... బరిలోకి దిగిన పాకిస్తాన్‌ తన ‘సహజ’ ఆటను ...

అందరి చూపులు అందుకోసమే
చాంపియన్స్ ట్రోఫీలో భారీ అంచనాలతో దిగిన జట్లు భారత్-ఇంగ్లండ్లు. ...

దయచేసి ఆ ముద్ర వేయొద్దు: బుమ్రా
ఇంగ్లండ్ గడ్డపై ఈ సారి చాంపియన్స్‌ ట్రోఫీలో బంతి అంతగా స్వింగ్ అవకున్నా ...

అనుష్కతో ఆ మాట చెప్పి ఏడ్చేశాను!
తన ప్రేయసి అనుష్క శర్మతో తాను షేర్ చేసుకున్న ఓ గుడ్ న్యూస్ ...

కోహ్లీకి, డివిలియర్స్‌కు తేడా అదే..
చాంపియన్స్‌ ట్రోఫీలో దక్షిణాఫ్రికాతో జరిగిన చావోరేవో మ్యాచ్‌లో భారత గెలుపుకు బౌలర్ల .. ...

సచిన్ రికార్డును బద్దలు కొట్టాడు!
టీమిండియా ఓపెనర్ శిఖర్ ధావన్ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ...

ఆ రెండు రనౌట్లు నా తప్పిదమే..
చాంపియన్స్ ట్రోఫీలో సెమీస్ చేరాలంటే కచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ లో భారీ అంచనాల ...

భారత్‌ పై మాది చెత్త ప్రదర్శన..
చాంపియన్స్‌ట్రోఫీలో భారత్‌తో జరిగిన కీలకపోరులో దక్షిణాఫ్రికా చెత్త ప్రదర్శనపై ఆ జట్టు ...

పాకిస్తాన్ తొమ్మిదిసార్లు..
చాంపియన్స్ ట్రోఫీలో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ...



Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.