Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

'యువరాజ్ లేకుండా చూడలేం'

Sports | Updated: Jun 16, 2017 11:50 (IST)


న్యూఢిల్లీ: మూడొందల వన్డే మ్యాచ్ ఆడి అరుదైన ఘనతను సొంత చేసుకున్న భారత స్టార్ ఆటగాడు యువరాజ్ సింగ్ పై దిగ్గజ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ప్రశంసల వర్షం కురిపించాడు. అతని పదిహేడేళ్ల క్రికెట్ కెరీర్ అసాధారణమని ద్రవిడ్ కితాబిచ్చాడు. అసలు యువరాజ్ లేని ఆల్ టైమ్ వన్డే ఎలెవన్ జట్టును చూడటం చాలా కష్టమని అభిప్రాయపడ్డాడు.  సీరియస్ గా చూస్తే యువరాజ్ లేని భారత వన్డే జట్టును ఊహించలేమన్నాడు. ' యువరాజ్ జట్టులో ఉండాలని ప్రతీ భారత అభిమాని కోరుకుంటాడు. అతని సుదీర్ఘ కెరీర్ లో సాధించిన అద్భుతమైన ఘనతలే యువరాజ్ ను ఉన్నతస్థానంలో నిలబెట్టాయి. యువరాజ్ లేని జట్టును ప్రస్తుతం ఎవరూ కోరుకోరు. ఒంటి చేత్తో ఎన్నో విజయాల్ని అందించాడు. అతనొక క్రికెట్ లో సూపర్ స్టార్. యువరాజ్ లేకుండా జట్టును ఊహించలేము. క్యాన్సర్ ను సైతం జయించడమే అతి పెద్ద విషయమైతే, ఆ తరువాత కూడా యువరాజ్ మునుపటిలా ఆడటం నిజంగా అద్భుతం 'అని ద్రవిడ్ కొనియాడాడు.

 

చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్ యువరాజ్ కు 300వ వన్డే. అయితే ఆ మ్యాచ్ లో యువరాజ్ బ్యాటింగ్ కు దిగకుండానే భారత్ ఘన విజయం సాధించి ఫైనల్లోకి ప్రవేశించింది.ఇదిలా ఉంచితే, చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో భారత జట్టు ఫామ్ ను కొనసాగించి టైటిల్ ను సాధించాలని ద్రవిడ్ ఆకాంక్షించాడు. మంచి ఫామ్ లో ఉన్న విరాట్ కోహ్లి అదే ఆట తీరును తుది పోరులో కనబరుస్తాడని ఆశిస్తున్నట్టు పేర్కొన్నాడు. అయితే భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాలని కోహ్లికి ద్రవిడ్ సూచించాడు. ఇటీవల అతి పెద్ద లక్ష్యాలను సైతం భారత్ సునాయాసంగా ఛేదించడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన ద్రవిడ్.. జట్టు తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు పలువురు సీనియర్ ఆటగాళ్లు తమ అనుభవంతో ఆదుకుంటున్నారన్నాడు. ఇది భారత జట్టు పటిష్టతను తెలియజేస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదన్నాడు.


టాగ్లు: yuvraj singh,rahul dravid,champions trophy 2017,యువరాజ్ సింగ్,రాహుల్ ద్రావిడ్,చాంపియన్స్ ట్రోఫీ 2017

మరిన్ని వార్తలు


అందుకు ధోనినే కారణం..
చాంపియన్స్ ట్రోఫీలో బంగ్లాదేశ్ తో జరిగిన సెమీ ఫైనల్లో భారత్ ఘన ...

పాక్‌ ఫైనల్‌కు రావడంలో ఆశ్చర్యం లేదు
చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌కు పాకిస్థాన్‌ రావడం తనకు ఆశ్చర్యం కలగించలేదని ...

మాట నిలబెట్టుకున్నాడు!
చాంపియన్స్ ట్రోఫీలో తమ జట్టుపై పందెం కాసి ఓడిపోయిన ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ...

'చాంపియన్'లా వేటాడారు
కోటి ఆశలతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ కోరికను నిర్దాక్షిణ్యంగా తుంచేస్తూ టీమిండియా ...

'పాక్ జట్టు ఫిక్సింగ్‌కు పాల్పడింది'
చాంపియన్స్ ట్రోఫీలో తొలిసారిగా ఫైనల్లోకి ప్రవేశించిన పాకిస్తాన్ జట్టుకు మాజీ క్రికెటర్ ఆమీర్ ...

పాక్ ఆటతీరు అమోఘం
తెలివైన గేమ్ ప్లాన్‌తో రంగంలోకి దిగడంతో బంగ్లాదేశ్‌పై అలవోకగా విజయం సాధించామని కెప్టెన్ ...

యువీ రికార్డుపై భజ్జీ ఏమన్నాడంటే..!
చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌తో టీమిండియా క్రికెటర్ యువరాజ్‌ సింగ్‌ ...

ఫైనల్లో విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన భారత జట్టు ఫైనల్లోకి ...

ధావన్ మరో రికార్డు..
బంగ్లాదేశ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో ధావన్ మరో రికార్డును నెలకొల్పాడు. ...

జహీర్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను ...



Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.