Alexa
icc2017
icc2017

మీరు ఇక్కడ ఉన్నారు: హోం | కథనాలు | కథ

చిత్తైన ఇంగ్లండ్‌.. ఫైనల్లో పాక్‌

Sports | Updated: Jun 16, 2017 07:25 (IST)


► ఇంగ్లండ్‌పై ఘన విజయం
► పాక్‌ ఆటగాళ్ల సమిష్టి ప్రదర్శన


వరుస విజయాలతో దూకుడు మీద ఉన్న ఇంగ్లండ్‌ను చూసి ప్రతి ఒక్కరూ ఫైనల్‌కు ఆ జట్టే వెళ్తూందని భావించారు. ఇక మాజీ క్రికెటర్లు బెట్‌ కూడా వేసుకున్నారు..  చివరికి భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ నోటా కూడా ఇదే మాట.. కానీ అందరి అంచనాలు పటా పంచెలు చేస్తూ పాక్‌ ఫైనల్‌ రేసుకు దూసుకెళ్లి దాయదీ జట్లకు సవాలు విసిరింది.

కార్డిఫ్: చాంపియన్స్‌ ట్రోఫీలో ఇంగ్లండ్‌తో జరిగిన తొలి సెమీస్‌లో పాక్‌ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టోర్నీలో ఓటమెరుగని జట్టును ఓడించి ఇంటికి సాగనంపింది. ఆడినా మూడు మ్యాచుల్లో 300 పై చిలుకు పరుగులు చేసిన ఇంగ్లండ్‌ను పాక్‌ 211 పరుగులకే కుప్పకూల్చింది. బౌలర్ల సమిష్టి ప్రదర్శనతో ఆకట్టుకోగా.. బ్యాట్స్‌మెన్స్‌ తమ బాధ్యతను నిర్వర్తించి విజయాన్నందించారు. 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌, ఓపెనర్లు అజార్‌, ఫకార్‌లు అర్ధ సెంచరీలతో చెలరేగడంతో రెండో వికెట్‌కు 118 పరుగులు జమయ్యాయి.

తొలుత 49 బంతుల్లో ఫకార్‌ అర్ద సెంచరీ చేయగా, అజార్‌ 68 బంతుల్లో సాధించాడు. వీరి శతక భాగస్వామ్యానికి ఇంగ్లండ్‌ నిర్ధేశించిన లక్ష్యం చిన్నబోయింది.  57 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఫకార్‌ వెనుదిరగగా క్రీజులోకి వచ్చిన బాబర్‌, అజార్ తో కలిసి ఆచితూచి ఆడాడు. అజార్‌ అలీ(70; 100 బంతులు,5 ఫోర్లు,1 సిక్స్‌) అవుటవ్వడంతో మూడో వికెట్‌కు 55 పరుగులు జమయ్యాయి. దీంతో పాక్‌ విజయం సులువైంది. అనంతరం క్రీజులోకి వచ్చిన హఫీజ్‌ సాయంతో బాబర్‌ మిగతా పనిని పూర్తిచేశాడు.

అంతకు ముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు చేసిన ఇంగ్లండ్‌ పాక్‌ బౌలర్ల దాటికి 211 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మన్‌లో బెయిర్‌ స్టో(43), జోరూట్‌ (46), బెన్‌ స్టోక్స్‌(34), మోర్గాన్‌(33)లు విఫలమవ్వడంతో ఇంగ్లండ్‌ పాక్‌కు స్వల్ప లక్ష్యాన్ని నిర్ధేశించింది. పాక్‌ బౌలర్లలో హసన్‌ అలీ (3), రుమాన్‌ రయీస్‌ (2), జునైద్‌ ఖాన్‌ (2), షదాబ్‌ ఖాన్‌(1) వికెట్లు పడగొట్టారు.


టాగ్లు: Champions Trophy,Pak-England,Fakhar చాంపియన్స్‌ ట్రోఫీ,పాక్‌-ఇంగ్లండ్‌,ఫకార్‌

మరిన్ని వార్తలు


ఫైనల్లో విరాట్ సేన
చాంపియన్స్ ట్రోఫీలో డిఫెండింగ్ చాంపియన్ గా బరిలో దిగిన భారత జట్టు ఫైనల్లోకి ...

ధావన్ మరో రికార్డు..
బంగ్లాదేశ్ తో జరుగుతున్న సెమీ ఫైనల్లో ధావన్ మరో రికార్డును నెలకొల్పాడు. ...

జహీర్ రికార్డును బ్రేక్ చేసిన జడేజా
చాంపియన్స్ ట్రోఫీలో భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అరుదైన ఘనతను ...

టీమిండియా లక్ష్యం 265
:చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఇక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ ...

హార్దిక్ ఎంత పనిచేశాడు..!
చాంపియన్స్ ట్రోఫీలో భాగంగా భారత్ తో జరుగుతున్న సెమీ ఫైనల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ ...

తొలి రెండు వికెట్లు భువీకే..
చాంపియన్స్ ట్రోఫీలో ఇక్కడ భారత్ తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ ...

గెలిచేది మన జట్టే..!
చాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా కీలకమైన సెమీఫైన్‌ పోరుకు వేదికైన బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌ బాస్టన్‌ ...

రెండో ఫైనల్ బెర్త్ ఎవరిదో?
చాంపియన్స్ ట్రోఫీలో రెండో సెమీ ఫైనల్ బెర్త్ కు రంగం సిద్ధమైంది. ...

పాక్ జట్టులో అతడికి చోటివ్వొద్దు!
సంచలనాలకు కేంద్ర బిందువైన పాకిస్తాన్‌ మళ్లీ అనూహ్య విజయాన్ని దక్కించుకుని చాంపియన్స్ ట్రోఫీలో ...

బహుపరాక్‌
బంగ్లాదేశ్‌ ప్రమాదకరమైన జట్టు... చాంపియన్స్‌ ట్రోఫీ సెమీఫైనల్‌ ...



Group A

P W L PTS NRR
ENG 3 3 0 6 1.04
BAN 3 1 1 3 0.00
AUS 3 0 1 2 -0.99
NZ 3 0 2 1 -1.05

Group B

P W L PTS NRR
IND 3 2 1 4 1.37
PAK 3 2 1 4 -0.68
SA 3 1 2 2 0.16
SL 3 1 2 2 -0.79

© Copyright Sakshi 2017. All rights reserved.