Alexa
YSR
‘సంక్షేమ పథకాలతో ఎప్పటికీ ప్రజల మనస్సుల్లో ఉండిపోతాం’
మీరు ఇక్కడ ఉన్నారు: హోం ప్రకటన

ఎయిర్ ఏషియా అద్భుతమైన ఆఫర్

Sakshi | Updated: April 19, 2017 14:25 (IST)

నిరంతరం కంప్యూటర్లతో కుస్తీలు పడుతూ గడిచిపోతున్న కార్పొరేట్ జీవితానికి సరాదాగా గడిపేందుకు కొంత సమయం దొరికితే.. ఆహా.. భలే ఛాన్స్ దొరికిందిలే అని సంబరపడిపోతుంటారు. తమను తాము రీఫ్రెష్ చేసుకోవడానికి స్నేహితుల ఇళ్లకి, ఫాంహౌజ్ లకి వెళ్లి ఎంజాయ్ చేస్తుంటారు. అయితే ఈసారి లాంగ్ వీకెండ్స్ విదేశాలకు ఎందుకు ప్లాన్ చేసుకోకూడదు. అదే థాయ్ లాండ్ లాంటి దేశమైతే ఎలా ఉంటుంది. మీ వీకెండ్ మరచిపోలేని ఎన్నో అనుభవాలు, అనుభూతులను మిగులుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.

థాయ్ లాండ్ కు వీకెండ్ ప్లానా? కొంచెం ఖర్చెక్కువ అని వెనుకడుగు వేస్తున్నారేమో. మీ కోసం బడ్జెట్ ప్యాసెంజర్ క్యారియర్ " ఏయిర్ ఏసియా ఎక్స్ క్లూజివ్ ఆఫర్ " ను తీసుకొచ్చేసింది. ఈ ఎక్స్ క్లూజివ్ ఆఫర్ 2017 ఏప్రిల్ 23 వరకు అందుబాటులో ఉంచుతోంది. ఈ ఎక్స్ క్లూజివ్ ఆఫర్లో భాగంగా రిటర్న్ టిక్కెట్లను రూ.4,999 నుంచి ప్రారంభిస్తోంది. మీరు కలలుకనే అద్భుతమైన హాలిడే ట్రిప్పును సాకారం చేసేందుకు " ఏయిర్ ఏసియా " తమ సమ్మర్ సేల్ ను ఈ వీక్ నుంచి అందిస్తోంది. మరి మీరు ప్రయాణించాలనుకుంటున్న పర్యాటక స్వర్గధామం థాయ్ గురించి మీకోసం కొన్ని అద్భుత విశేషాలు.

రుచికరమైన థాయ్ వంటకాలు :
థాయ్ గురించి చెప్పాలంటే మనకు ముందుగా గుర్తుచ్చేవి అక్కడి పసందైన వంటకాలే. ప్రపంచ వ్యాప్తంగా ఇక్కడి వంటకాలకు తెగ ప్రాచుర్యం ఉంది. పెనాంగ్ అస్సాం లస్కా, చార్ సుయి, సంబల్ స్టింగ్రే వంటి అమేజింగ్ థాయ్ లాండ్ వంటకాలు పర్యాటకుల నోరూరిస్తుంటాయి. ప్రపంచంలో మరెక్కడా కూడా కనీవిని ఎరుగని వంటకాలను థాయ్ లాండ్ అందిస్తోంది.

అద్భుతమైన షాపింగ్ :
వంటకాల తర్వాత షాపింగ్ కు థాయ్ లాండ్ చాలా ఫేమస్. షాపింగ్ అంటే ఎవరికి ఇష్టముండదు చెప్పండి. బ్యాంకాక్, ఫుకెట్ లాంటి ప్రాంతాలను షాపింగ్ కు ఎంచుకున్నారంటే చాలు.. జీవితంలో మరిచిపోలేని షాపింగ్ అనుభవాన్ని అవి కల్పిస్తాయి. ఇంట్లో సాధారణంగా ధరించే దుస్తుల నుంచి ఇంటిని అద్దాల మేడగా అలంకరించే డిజైనర్ వస్త్రాల వరకు ఇక్కడ దొరకనిది అంటూ ఉండదు. ప్రపంచంలో ఉన్న వస్త్రాలన్నింటిన్నీ తమపై అలంకరించుకున్న మాదిరిగా ఈ షాపింగ్ ప్రదేశాలు పర్యాటకులను అలరిస్తుంటాయి.

ఉల్లాసభరితమైన బీచులు :
చీకట్లను తరిమేస్తూ.. మనసును ఉత్తేజపరిచేలా అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడిని థాయ్ బీచ్ లో కూర్చుని చూస్తుంటే నిజంగా ఆ అనుభూతే వేరు. థాయ్ కున్న మరో ప్రత్యేకతలో ఆ దేశపు అద్భుతమైన బీచ్ లు ఒకటి. స్యామ్యూయీ, కో చాంగ్, కో ఫై ఫై ప్రాంతాలు తప్పనిసరిగా మీరు సందర్శించాల్సిన ద్వీపకల్పాలు. ఆ స్వచ్ఛమైన నీటి పయనాన్ని చూస్తుంటే.. కనురెప్ప కూడా కిందకి వాలాలనిపించదు. అంతలా పర్యాటకులను ఆకట్టుకుంటాయి థాయ్ బీచ్ లు. క్రేజీ స్ట్రీట్ ఫుడ్, షాపింగ్ మాత్రమే కాదండి.. సాహస ప్రయాణాలకు థాయ్ లాండ్ సావాసమే...

మరికెందుకు ఆలస్యం ఏప్రిల్ 23 వరకు " ఎయిర్ ఏషియా " అందిస్తున్న... అందుబాటులో ఉన్న ఎక్స్ క్లూజివ్ ఆఫర్ సద్వినియోగం చేసుకుని, థాయ్ లాండ్ వీక్షించేయండి.

© Copyright Sakshi 2017. All rights reserved. | ABC